- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan's Upcoming Movies Releasing date update on 24 04 2025
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదంటున్న మేకర్స్
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... ఎన్నో రోజులుగా ఆడియన్స్‌ను వెయిటింగ్‌లో పెట్టిన పవన్, ఫైనల్‌గా రిలీజ్‌లకు రెడీ అవుతున్నారు. పక్కా ప్లానింగ్‌తో రెగ్యులర్ ఇంటర్వేల్స్‌లో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఏ సినిమా ఎప్పుడు రాబోతుంది.? అసలు ఎన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి? ఈ స్టోరీలో చూద్దాం.
Updated on: Apr 24, 2025 | 9:00 PM

హరి హర వీరమల్లు రిలీజ్ విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఆల్మోస్ట్ తెర పడినట్టే. జూన్‌లో ఈ సినిమా పక్కగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే షూటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్, రిలీజ్ డేట్ విషయంలోనూ ఓ నిర్ణయానికి వచ్చేశారు.

వీరమల్లు ఆడియన్స్ ముందుకు వచ్చిన తరువాత షార్ట్ గ్యాప్‌లోనే మరో మూవీ రిలీజ్‌కు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మోస్ట్ అవెయిటెడ్ ఓజీ రిలీజ్‌కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు పవర్ స్టార్.

ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్‌లో ఓజీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ఆలోచన. రిలీజ్‌ల విషయంలోనే కాదు షూటింగ్‌ల విషయంలోనూ ఓ నిర్ణయం తీసుకున్నారు పవర్ స్టార్.

వీరమల్లు, ఓజీ వర్క్ ఫినిష్ అయిన తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించబోతున్నారు. హరీష్ దర్శకత్వంలో చాలా రోజుల కిందటే ప్లాన్ చేసిన ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను 2026లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు.

ఇన్నాళ్లు పవన్ సైడ్ నుంచి క్లారిటీ రాకపోవటంతో ఆగిన సినిమాలన్నీ ఇప్పుడు ఒకేసారి యాక్టివ్ అవుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ షూట్స్‌తో పాటు కొంత వరకు ప్రమోషన్స్‌లోనూ పాల్గొనేలా పక్కాగా తన షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు పవర్ స్టార్.




