Kalki 02: కల్కి 2 పై నాగ్ అశ్విన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. వాటి వెనక ఉన్న అర్ధం ఏంటి ??
కల్కి 2 రిలీజ్ విషయంలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఇప్పుడు కామెంట్ మీదే ఫిలిం సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. నాగీ సరదాగానే అన్నట్టుగా అనిపించినా.. ఆ మాట వెనుక పెద్ద అర్ధమే ఉందంటున్నారు సినీ జనాలు. ఇంతకీ నాగీ ఏమన్నారు.? దాని వెనుక ఉన్న ఆ అర్ధం ఏంటి..? ఈ స్టోరీలో చూద్దాం.
Updated on: Apr 24, 2025 | 9:15 PM

కల్కి 2 రిలీజ్ విషయంలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఇప్పుడు కామెంట్ మీదే ఫిలిం సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. నాగీ సరదాగానే అన్నట్టుగా అనిపించినా.. ఆ మాట వెనుక పెద్ద అర్ధమే ఉందంటున్నారు సినీ జనాలు. ఇంతకీ నాగీ ఏమన్నారు.? దాని వెనుక ఉన్న ఆ అర్ధం ఏంటి..? ఈ స్టోరీలో చూద్దాం.

కల్కి 2898 ఏడీ రిలీజ్ అయి ఏడాది కావొస్తుంది. అప్పటి నుంచి సీక్వెల్ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కానీ ఇంత వరకు యూనిట్ సైడ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఈ ఏడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పినా... ఎప్పుడూ... ఎక్కడా? అన్నది క్లారిటీ లేదు. ఓ తమిళ ఫంక్షన్‌లో మాట్లాడిన నాగీ... కల్కి 2 రిలీజ్ విషయంలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

కల్కి సినిమా రెండు మూడు గ్రహాలు కలిసినప్పుడు రిలీజ్ చేశాం... కల్కి 2ను ఏడెనిమది గ్రహాలు కలిసే టైమ్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అన్నారు. అయితే నాగీ కామెంట్ సరదాగానే అనిపించినా.. దాని వెనుక పెద్ద అర్ధమే ఉందన్నది ఇండస్ట్రీ టాక్.

ప్రజెంట్ ప్రభాస్ చేతిలో ఏడెనిమిది సినిమాలున్నాయి. ఆ సినిమాలనే నాగీ గ్రహాలు అంటూ సెటైర్ వేశారా..? అవి ఓ కొలిక్కి వస్తే గానీ కల్కి 2 పట్టాలెక్కే ఛాన్స్ లేదా? అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. ఏది ఏమైనా ప్రజెంట్ ప్రభాస్ లైనప్ చూస్తే కల్కి 2 ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ అయితే కనిపించటం లేదు.