- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna's Akhanda 2 Movie Shooting Update on 24 04 2025
Akhanda 02: ఖండాలు దాటిన అఖండ 2.. కొత్త అప్‌డేట్ తో ఫ్యాన్స్ ఖుష్
అఖండ సీక్వెల్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునే రోజులో సినిమాను ప్లాన్ తీర్చి దిద్దుతున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి అప్‌డేట్ నందమూరి అభిమానుల్లో మరింత జోష్ నింపింది.
Updated on: Apr 24, 2025 | 9:30 PM

అఖండ సీక్వెల్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునే రోజులో సినిమాను ప్లాన్ తీర్చి దిద్దుతున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి అప్‌డేట్ నందమూరి అభిమానుల్లో మరింత జోష్ నింపింది.

అఖండ సినిమా సూపర్ హిట్ కావటంతో వెంటనే సీక్వెల్‌ను ఎనౌన్స్ చేశారు మేకర్స్. ప్రజెంట్ ఆ సినిమా షూటింగ్‌లోనే బిజీగా ఉన్నారు నందమూరి నటసింహం.

సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉండటంతో మేకింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుంది మూవీ టీమ్. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు కుంభమేళ, హిమాళయాల్లో షూటింగ్స్ చేసిన యూనిట్, త్వరలో జార్జియాలో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది.

అక్కడ కూడా యాక్షన్ ఎపిసోడే చిత్రకీరించబోతున్నారు. సినిమాలో కీలకమైన యాక్షన్ బ్లాక్ కావటంతో భారీ బడ్జెట్‌తో ఈ సీక్వెన్స్‌ను రూపొందిస్తున్నారు.

ముందు దసరా బరిలోనే అఖండ 2ను రిలీజ్ చేయాలనుకున్నా... షూటింగ్ ఆలస్యమవుతుండటంతో డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు బ్రేక్ తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నారు బాలయ్య.