AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beggar: బిచ్చగాళ్లుగా ఇద్దరు తమిళ హీరోలు.? మన కెప్టెన్స్ దర్శకత్వంలో..

ఒకప్పట్లా హీరోలను అలాగే చూపించాలి.. ఇలాగే చూపించాలనే కండీషన్స్ ఏం లేవిప్పుడు. మారుతున్న పరిస్థితులతో పాటు హీరోలు కూడా మారిపోయారు. దర్శకులు కూడా కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు తమిళ స్టార్ హీరోలను మన దర్శకులు బిచ్చగాళ్లుగా మార్చేస్తున్నారు. కాస్త కష్టమే.. కానీ కథ చూడమంటూ సవాల్ చేస్తున్నారు. మరి ఆ కథేంటో చూద్దామా..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Prudvi Battula|

Updated on: Apr 25, 2025 | 1:49 PM

Share
మా సినిమాలో హీరో బిచ్చగాడు అని చెప్పడానికి ఒకప్పుడు దర్శకులు భయపడేవాళ్లేమో గానీ.. బిచ్చగాడు సినిమా హిట్టైన తర్వాత ఆ భయం పోయింది. తాజాగా ఇద్దరు తమిళ హీరోలు తెలుగు దర్శకులతో అదే కాన్సెప్ట్‌తోనే సినిమాలు చేస్తున్నారు.

1 / 5
అందులో ఒకటి కుబేరా.. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ క్యారెక్టర్ బెగ్గరే. కుబేరా టీజర్, సాంగ్స్ అన్నింటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో నాగార్జున మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్.

2 / 5
కుబేర త్వరలోనే సినిమా విడుదల కానుంది. విడుదలకు ముందే బిజినెస్ పరంగానూ సేఫ్ జోన్‌కు వచ్చింది కుబేరా. ధనుష్ సినిమాలో ఉన్నపుడు.. దర్శకుడు ధైర్యంగా ఎలాంటి ప్రయోగమైన చేసుకోవచ్చు.. శేఖర్ కమ్ముల కూడా ఇదే చేస్తున్నారిప్పుడు.

3 / 5
తన హీరోలను రఫ్ అండ్ టఫ్‌గా చూపించే పూరీ జ‌గ‌న్నాథ్.. విజయ్ సేతుపతి కోసం మాత్రం డిఫెరెంట్ క్యారెక్టర్ రాస్తున్నట్లు తెలుస్తుంది. ఇది పూరీ తరహా మాస్ సినిమా కాదు.. విజయ్ స్టైల్‌లో సాగే డిఫెరెంట్ కథ. ఇందులో ట‌బు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించబోతున్నారు. సినిమా జూన్‌లో సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాను కేవ‌లం 60 రోజుల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు పూరీ.

4 / 5
ఇప్పటికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తైంది.. విజయ్ వచ్చేసరికి బౌండెడ్ స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉంటారు పూరీ. ఈ సినిమాకు ‘బెగ్గ‌ర్‌’ అనే టైటిల్ దాదాపు ఖరారైపోయింది. ఇందులో విజ‌య్ ఓ బిచ్చ‌గాడిగా క‌నిపించ‌బోతున్నారని.. అందుకే ఈ టైటిల్ పెట్టారని తెలుస్తుంది. మురికివాడ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. మొత్తానికి ఇటు ధనుష్.. అటు విజయ్ సేతుపతి ఇద్దరూ ఒకేసారి బిచ్చగాడి పాత్రలు చేస్తున్నారు.

5 / 5