కేంద్రం పీఎం ఏసీ యోజన స్కీమ్‌ ద్వారా ఉచితంగా ఏసీలను అందిస్తుందా?

22 April 2025

Subhash

కేంద్ర ప్రభుత్వం పీఎం ఏసీ యోజన 2025 స్కీమ్‌ కింద అందరికి ఉచితంగా ఏసీలను అందిస్తుందని ఓవార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

పీఎం ఏసీ యోజన

దీని కింద 1.5 కోట్ల 5-స్టార్ ఎయిర్ కండిషనర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని రాసి ఉంది. పోస్ట్‌లో వీలైనంత త్వరగా ఫారమ్ నింపమని విజ్ఞప్తి ఉంది. 

ఎయిర్ కండిషనర్

30 రోజుల్లోపు మీ ఇంట్లో ఏసీ ఇన్‌స్టాల్ చేయబడుతుందని పేర్కొంటూ ఓ వార్త వైరల్‌ అవుతోంది. మరి నిజంగా ఇలాంటి పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందా? ఇప్పుడు చూద్దాం.

30 రోజుల్లో

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఉచిత ఏసీ ఇచ్చే ఈ పథకం గురించి ప్రచారం జరుగుతోంది.

ఇందులో నిజం ఏంటి?

ప్రభుత్వం ఈ పథకాన్ని మే 2025 నుండి ప్రారంభించబోతోందని వైరల్‌ అవుతోంది. దీని కోసం ఇంధన మంత్రిత్వ శాఖ 1.5 కోట్ల ఏసీలను ఆర్డర్ చేసినట్లు కూడా ఉంది. 

ప్రభుత్వం

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వైరల్ పోస్ట్ వాస్తవాన్ని తనిఖీ చేసింది. ప్రభుత్వం అలాంటి పథకాన్ని ప్రకటించలేదని తేలింది. 

 PIB తనిఖీలో

ఈ వాదన పూర్తిగా అబద్ధమని, ఏ ప్రభుత్వ శాఖ లేదా ఇంధన మంత్రిత్వ శాఖ అటువంటి ఫారమ్‌ను జారీ చేయలేదని PIB స్పష్టం చేసింది.

ఫేక్ న్యూస్

ఇటువంటి సోషల్ మీడియా పోస్టుల ఉద్దేశ్యం ప్రజలను తప్పుదారి పట్టించడం, వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడమేనని, అనధికార లింక్‌లపై క్లిక్ చేయవద్దు.

సోషల్ మీడియా