AP News: సోషల్ మీడియాలో భార్య అసభ్యకర వీడియోలు.. చూసిన భర్త ఏం చేశాడంటే..?

AP News: సోషల్ మీడియాలో భార్య అసభ్యకర వీడియోలు.. చూసిన భర్త ఏం చేశాడంటే..?
Wife Husband

East Godavari District: ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉన్న అసభ్యకర దృశ్యాలు సోషల్ మీడియాలో

Shaik Madarsaheb

|

Jan 17, 2022 | 1:10 PM

East Godavari District: ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉన్న అసభ్యకర దృశ్యాలు సోషల్ మీడియాలో రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ భర్త.. తాను విషం తాగి, పిల్లలకూ కూడా తాగించాడు. ప్రస్తుతం అతనితోపాటు పదేళ్ల కొడుకు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన నుంచి మరో బాలుడు తప్పించుకున్నాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని వంగలపూడిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. సీతానగరం ఎస్ఐ శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వంగలపూడికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటుంది. ఆమె భర్త స్వగ్రామం గోకవరంలో ఉంటుండగా.. 13, 10 ఏళ్ల ఇద్దరు కుమారులు , 12 ఏళ్ల కుమార్తె.. ముగ్గరూ అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. అయితే.. తండ్రి అప్పుడప్పుడూ వెళ్లి పిల్లల్ని చూసి వస్తుండేవాడు. ఈ క్రమంలో భార్యకు సంబంధించిన అసభ్యకరమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం పండగ అని చెప్పి తండ్రి వంగలపూడి వెళ్లాడు. ఇంట్లో కాసేపు ఉండి.. ఆ తరువాత తన ముగ్గురు పిల్లలను బయటకు తీసుకెళ్లాడు. వారిని గ్రామంలో తోటలు ఉండే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న ఎలుకల ముందు తాగాడు. ఆ తర్వాత ముగ్గురు పిల్లలతో తాగించేందుకు ప్రయత్నించాడు. పదేళ్ల కుమారుడు మాత్రమే మందు తాగాడు.. చేదుగా ఉండడంతో మరో ఇద్దరు తాగలేదు. కొంతసేపటికే ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు.

అయితే అపస్మారక స్థితిలో పడిఉన్న తండ్రి, సోదరుడి దగ్గర కూర్చున్న పిల్లలను చూసిన కొందరు స్థానికులు విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆదివారం వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరు పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

అయితే.. తన భార్యకు సంబంధించిన అసభ్యకరమైన వీడియో సమీప బంధువుల నుంచి సోషల్ మీడియాలో వచ్చిందని దీంతో తాను మనస్థాపానికి గురై ఇలా చేశానంటూ బాధితుడు స్టేట్మెంట్ ఇచ్చాడని పోలీసులు తెలిపారు. అయితే వీడియోలను పరిశీలించాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే.. బాధితుడు ఆటో నడుపుతాడని.. గతంలో చోరీలకు సైతం పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీతానగరం పోలీసులు తెలిపారు.

Also Read:

AP News: పండుగపూట యువకుల ప్రాణం తీసిన సరదా.. కాల్వలో ఈత కొట్టేందుకు దిగి..

North Korea: మరింత మొండిగా కిమ్.. ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం.. హెచ్చరికలు జారీ చేసిన జపాన్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu