North Korea: మరింత మొండిగా కిమ్.. ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం.. హెచ్చరికలు జారీ చేసిన జపాన్..

ఉత్తర కొరియా మరింత మరింత మొండిగా వ్యవహరిస్తోంది. ఒక నెలలో నాల్గవ సారి సముద్రంలో రెండు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. సరిహద్దు దేశాలను..

North Korea: మరింత మొండిగా కిమ్.. ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం.. హెచ్చరికలు జారీ చేసిన జపాన్..
North Korea
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 17, 2022 | 12:16 PM

ఉత్తర కొరియా మరింత మరింత మొండిగా వ్యవహరిస్తోంది. ఒక నెలలో నాల్గవ సారి సముద్రంలో రెండు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. సరిహద్దు దేశాలను వణికిస్తోంది హెచ్చరికలు జారీ చేస్తోంది. మొండిగా వ్యవహరిస్తోంది. తాజాగా మరో క్షిపణి ప్రయోగం చేసినట్లుగా దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా ఈ ఏడాది వరుసగా రెండు క్షిపణి పరీక్షలు నిర్వహించినప్పుడు.. అమెరికా దానిపై ఆంక్షలు విధించింది. నియంత కిమ్ జోంగ్ ఉన్ దీనిని రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించారు. ప్రతిస్పందించడానికి మరొక క్షిపణి పరీక్షను నిర్వహించారు. ఇప్పుడు అమెరికా కొత్త ఆంక్షల తర్వాత రెండోసారి క్షిపణి పరీక్ష జరిగినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. అంటే ఏడాది ప్రారంభం నుంచి ఉత్తర కొరియా నాలుగుసార్లు క్షిపణి పరీక్షలు నిర్వహించింది.

రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని సునన్ విమానాశ్రయం నుంచి ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించే అవకాశం ఉందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ సోమవారం తెలిపారు. అయితే ఈ క్షిపణులు ఎంత దూరం ప్రయాణించాయనేది ఇంకా తెలియరాలేదు. ఈ పరీక్ష గురించి జపాన్ ప్రభుత్వం కూడా సమాచారం ఇచ్చింది. అదే సమయంలో, ఇది ఈ ప్రాంతం శాంతి, భద్రతకు ముప్పు అని ఖండించారు. క్షిపణి పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందాలని ప్రధాని ఫుమియో కిషిడా తన ప్రభుత్వాన్ని ఆదేశించారు. అలాగే, నౌకలు, విమానాల భద్రతను నిర్ధారించాలి.

జపాన్ కోస్ట్ గార్డ్ హెచ్చరికలు

జపాన్ సముద్ర జలాల్లో నౌకలకు జపాన్ తీర రక్షక దళం హెచ్చరికలు జారీ చేసింది. ఆకాశం నుంచి పడే వస్తువులను చూస్తూ ఉండమని ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు క్షిపణి పరీక్షకు సంబంధించి ఎలాంటి నష్టం వాటిల్లినట్లు వార్తలు రాలేదు. వార్నింగ్ ఇవ్వకముందే ఉత్తర కొరియా క్షిపణులు ఎక్కడో పడిపోయాయని కోస్ట్ గార్డ్ తరువాత సమాచారం ఇచ్చింది. అయితే అవి ఎక్కడికి నుంచి వచ్చాయో తెలియదని వెల్లడించింది.

గత వారం ఉత్తర కొరియా హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించింది. దీనిని కిమ్ జాంగ్ ఉన్ ప్రశంసించారు. శుక్రవారం తెల్లవారుజామున రైలు నుంచి రెండు క్షిపణులను ప్రయోగించారు. అణ్వాయుధాలను కలిగి ఉన్న ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

సందిగ్ధంలో అమెరికాతో చర్చలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2019లో నిరాయుధీకరణకు సంబంధించి కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చలు జరిపారు. కానీ ఉత్తర కొరియా రాయితీల డిమాండ్ కారణంగా చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. పరీక్షల ఫలితంగా కొత్త ఆంక్షలు విధించినందుకు ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం అమెరికాను మందలించింది.

ఉత్తర కొరియా తన నిరంతర ఆయుధ పరీక్షలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిని అమెరికా కోరింది. అమెరికాను బెదిరించి రాయితీలు పొందేందుకు కిమ్ జోంగ్ ఆయుధాలను పరీక్షించడం ద్వారా తన పాత వ్యూహాన్ని అవలంబిస్తున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు అచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Pandit Birju Maharaj: ఆ సవ్వడి ఇక వినిపించదు.. ప్రముఖ కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జు మహారాజ్‌‌కు గుండెపోటు

Glowing Skin : చలికాలంలో మెరిసే చర్మం కోసం.. ఈ వింటర్ సూపర్ ఫుడ్స్.. మీ డైట్‌లో చేర్చుకోండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్