US Snow Storm: అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం.. జనజీవనం అస్తవ్యస్తం..

US Snow Storm: ఆగ్నేయ అమెరికా ప్రాంతం (US south eastern areas)లో బలమైన గాలులతో కూడిన మంచు తుఫాను  బీభత్సం సృష్టించింది. ఈ మంచు తుఫానుతో విద్యుత్ సరఫరాకు అంతరాయం..

US Snow Storm: అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం.. జనజీవనం అస్తవ్యస్తం..
Snow Storm Hits Us
Follow us
Surya Kala

|

Updated on: Jan 17, 2022 | 11:40 AM

US Snow Storm: ఆగ్నేయ అమెరికా ప్రాంతం (US south eastern areas)లో బలమైన గాలులతో కూడిన మంచు తుఫాను  బీభత్సం సృష్టించింది. ఈ మంచు తుఫానుతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. రోడ్లపై భారీగా మంచు పేరుకుంది. భారీ హిమపాతం (Snow Rain)తో కూడిన తుఫాను కారణంగా జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, ఫ్లోరిడాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నార్త్ కరోలినా , సౌత్ కరోలినా, జార్జియా, వర్జీనియాలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ మంచుతుఫాన్ తో ఒక అంగుళం మేర మంచు పేరుకుందని అధికారులు చెప్పారు.

తుపాను కారణంగా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయం పై భారీగా ప్రభావం చూపించింది. ఆదివారం 1,000 కంటే ఎక్కువ విమానాల రాకపోకలు రద్దు చేయబడ్డాయి. ఇక ఆదివారం అట్లాంటా విమానాశ్రయంలో కూడా 300కు పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి. నార్త్ కరోలినాలోని కొన్ని ప్రాంతాలకు సోమవారం ఉదయం వరకు మంచు తుఫాను కురుస్తుందని హెచ్చరికలు జారీ చేశారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్తు అంతరాయం వలన లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరోలినా, జార్జియాలోని రోడ్లు మంచుతో కప్పబడి ఉన్నాయని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. దీని కారణంగా సుమారు 200,000 మంది ప్రజలు విద్యుత్తు లేకుండా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దక్షిణాదిలో, అనేక ప్రాంతాల గవర్నర్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మిస్సిస్సిప్పి, సెంట్రల్ నార్త్ కరోలినాలో ఇప్పటికే తొమ్మిది అంగుళాల వరకు హిమపాతం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ట్రల్ సౌత్ కరోలినాలో అర అంగుళం మేర మంచు కురిసింది. విద్యుత్, ట్రాఫిక్ సహ అనేక ఇతర అంశాలపై ఈ తుఫాన్ ప్రభావం చూపించిందని వాతావరణ అధికారి రిచ్ చెప్పారు.

ముందస్తు హెచ్చరిక:

ఈశాన్య ప్రాంతాలలోని ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే తమ ఇళ్ల నుండి బయటకు రావాలని అధికారులు కోరారు. కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వరకూ మూడు అంగుళాల మేర మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నాటికి, నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం, వాషింగ్టన్ ప్రాంతంలో ఇప్పటికే భారీ మంచుపాతం కురిసినట్లు నమోదయింది. న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాలకు మంచు తుఫాను హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ 20 అంగుళాల వరకు మంచు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

Also Read:

AP Government: ఏపీలో పాఠశాలలకు సెలవులు పొడిగింపు.? నేడే కీలక ప్రకటన.!