Abu Dhabi airport drone attack: అబుదాబిలో డ్రోన్ దాడి చేసిన హౌతీ తిరుగుబాటుదారులు..ఇద్దరు భారతీయుల మృతి..

Abu Dhabi airport drone attack: అబుదాబిలో డ్రోన్ దాడి చేసిన హౌతీ తిరుగుబాటుదారులు..ఇద్దరు భారతీయుల మృతి..
Drone Attack On Abu Dhabi

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని అబుదాబిలో డ్రోన్ దాడి జరిగింది. అబుదాబిలోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ దాడి జరిగింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఈ దాడికి బాధ్యత వహించారు.

KVD Varma

|

Jan 17, 2022 | 8:34 PM

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని అబుదాబిలో డ్రోన్ దాడి జరిగింది. అబుదాబిలోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ దాడి జరిగింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఈ దాడికి బాధ్యత వహించారు. ఈ దాడిలో ముగ్గురు చనిపోయారు. వీరిలో ఇద్దరు భారతీయులు(Indians), ఒక పాకిస్థానీ పౌరుడు ఉన్నారు. ఆరుగురు గాయపడ్డారు. దాడిలో చనిపోయిన భారత పౌరులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపారు. చమురు కంపెనీ ADNOC గిడ్డంగికి సమీపంలోని ముసాఫా పారిశ్రామిక ప్రాంతంలో ఇంధన ట్యాంకర్లు పేలినట్లు అధికారులు ఎమిరేట్స్ న్యూస్ ఏజెన్సీ (WAM)కి తెలిపారు. ఇది కాకుండా, అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని నిర్మాణ స్థలంలో కూడా మంటలు చెలరేగాయి.

ప్రాథమిక విచారణలో చిన్న విమానానికి చెందిన కొన్ని శకలాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బహుశా అవి డ్రోన్‌లు కావచ్చని భావిస్తున్నారు. వాటి కారణంగా ట్యాంకర్లు పేలి ఉంటాయనీ, విమానాశ్రయం మంటల్లో చిక్కుకుందికుందని అనుకుంటున్నారు. ఈ దాడిలో పెద్దగా నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.

యుఎఇలో సైనిక చర్య ప్రారంభించాం: హౌతీ తిరుగుబాటుదారుల ప్రకటన..

యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు యుఎఇ లోపల తమ సైనిక కార్యకలాపాలను ప్రారంభించినట్లు ప్రకటించారు. రానున్న కొద్ది గంటల్లో వీటి గురించి మరింత సమాచారం అందజేయనున్నామని వారు తెలిపారు. హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌లో యుఎఇ మద్దతుతో సంకీర్ణ దళాలను ఎదుర్కొంటున్నారు. 2019లో యెమెన్‌లో యుఎఇ తన బలగాల ఉనికిని గణనీయంగా తగ్గించినప్పటికీ, యుఎఇ ఆ సైనికులకు శిక్షణ.. ఆయుధాలను అందించినందున, దాని ప్రభావం అక్కడి సైన్యంలో ఉంది.

అబుదాబి విమానాశ్రయంపై భారీ దాడికి ప్రణాళిక ..

హౌతీ తిరుగుబాటుదారులు గత సంవత్సరం రెండు సౌదీ విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకున్నారు. యూఏఈలోని ఓ ప్రధాన విమానాశ్రయంపై తొలిసారిగా భారీ దాడికి ప్రయత్నించారు. UAEలోని స్థానిక మీడియా ప్రకారం, ఇది పెద్ద కుట్ర కావచ్చు.

యెమెన్‌లో 2015 నుంచి హౌతీల వివాదం..

యెమెన్‌లో 2015 నుంచి హౌతీ వివాదం కొనసాగుతోంది . 2015లో, హౌతీలు యెమెన్ రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నారు. అధ్యక్షుడు అబ్దర్బు మన్సూర్ హదీ దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం, ఉత్తర యెమెన్‌లో ఎక్కువ భాగం హౌతీల నియంత్రణలో ఉంది. సౌదీ అరేబియా మొదటి నుంచి హదీకి అనుకాలంగా వ్యవహరిస్తూ వస్తోంది. 2015లో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం హౌతీ తిరుగుబాటుదారులపై పలు వైమానిక దాడులు కూడా చేసింది.

నేటికీ ఈ సంకీర్ణ సైన్యం హౌతీలకు వ్యతిరేకంగా చురుకుగా ఉంది. దీనికి ప్రతిగా హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణి దాడులు కూడా చేశారు. సెప్టెంబర్ 2019లో, హౌతీ తిరుగుబాటుదారులు రెండు సౌదీ అరేబియా చమురు కర్మాగారాలపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు మార్కెట్‌పై ప్రభావం పడింది. ఒక నివేదిక ప్రకారం, హౌతీ తిరుగుబాటు కారణంగా ఇప్పటివరకు 70 వేల మందికి పైగా మరణించారు.

ఇవి కూడా చదవండి: North Korea: మరింత మొండిగా కిమ్.. ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం.. హెచ్చరికలు జారీ చేసిన జపాన్..

US Snow Storm: అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం.. జనజీవనం అస్తవ్యస్తం..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu