Weight Loss Tips: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? కలబందను ఇలా ఐదు పద్దతుల్లో తీసుకోండి..

Aloe Vera for Weight Loss: కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయి. ప్రాచీనకాలం నుంచి కలబందను పలు చికిత్సల్లో ఉపయోగిస్తున్నారు. అందుకే.. పలు సమస్యలకు

Weight Loss Tips: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? కలబందను ఇలా ఐదు పద్దతుల్లో తీసుకోండి..
Aloe Vera For Weight Loss
Follow us

|

Updated on: Jan 18, 2022 | 7:36 AM

Aloe Vera for Weight Loss: కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయి. ప్రాచీనకాలం నుంచి కలబందను పలు చికిత్సల్లో ఉపయోగిస్తున్నారు. అందుకే.. పలు సమస్యలకు అలోవెరా (Aloe Vera) ఉపయోగించాలని సూచిస్తుంటారు. అలోవెరాలో ఉన్న డిటాక్సిఫైయింగ్ గుణాల కారణంగా.. బరువు సులువుగా తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు చర్మం మృదువుగా చేసుకోవాలకున్నా.. ఇతర ఆరోగ్య సమస్యలను వదిలించుకోవాలన్నా.. కలబందను ఉపయోగించవచ్చు. బరువు తగ్గాలనుకునే (Weight Loss) వారు అలోవెరాను ఆహారంలో చేర్చుకోవచ్చు. మీరు దీన్ని మీ దినచర్యలో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు. ఈ దినచర్యలో కలబంద నుంచి తయారయ్యే జ్యూస్‌లు మొదలుకొని.. పలు పద్దతుల ఆధారంగా డైట్‌లో చేర్చుకోవచ్చు. ఆ పద్దతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భోజనానికి ముందు కలబంద రసం తాగాలి బరువు తగ్గడానికి, మీరు ప్రతిరోజూ భోజనానికి 15 నిమిషాల ముందు ఒక చెంచా కలబంద రసాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు.

వేడి నీళ్లలో కలబందను కలుపుకుని.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా కలబంద రసం కలపి ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా త్వరగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఇదే ఉత్తమైన మార్గమని పేర్కొంటున్నారు.

కలబంద – తేనె బరువు తగ్గడానికి మీరు కలబంద రసాన్ని తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. దీనికోసం అలోవెరాలో కొన్ని చుక్కల తేనె కలపాలి. ఇది దాని రుచిని మరింత మెరుగ్గా చేస్తుంది.

నిమ్మకాయ- కలబంద ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో నిమ్మకాయ రసాన్ని కలపాలి. దానిలో ఒక టీస్పూన్ అలోవెరా జెల్‌ వేయాలి. దీనిని కాస్త వేడి చేసి అందులో ఒక టేబుల్‌స్పూను తేనె కలుపుకుని తాగాలి. ఇలా ఈ ద్రవణాన్ని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే మంచిది. అయితే.. ఈ జ్యూస్ తాగిన గంట వరకు మీరు ఏమీ తినకూడదు. కలబందలోని డిటాక్సిఫైయింగ్ గుణాలు శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇది ప్రేగులను శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఆరెంజ్, స్ట్రాబెర్రీ – అలోవెరా నారింజ, కలబంద, స్ట్రాబెర్రీలను కలపడం ద్వారా మీరు బరువు తగ్గడానికి మంచి యాంటీఆక్సిడెంట్ పానీయాన్ని తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి.. నారింజ రసం.. మూడు నుండి నాలుగు స్ట్రాబెర్రీ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ తాజా కలబంద రసాన్ని కలపాలి. వీటన్నింటినీ గ్రైండర్‌లో నీటితో కలిపి మిక్స్ చేయాలి. ఆ తర్వాత తాగాలి.

ఇలా ప్రతిరోజూ చేస్తే.. సులువుగా బరువు తగ్గొచ్చు. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే.. వైద్యులను సంప్రదించడం మేలు..

Also Read:

Bone Health Tips: ఎముకలను బలహీనపరిచే అలవాట్లను మానేయండి.. వాటిని నేటి నుంచే మార్చుకోండి..

Blood Pressure: మీకు బీపీ ఉందా…? చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!