Srilakshmi C |
Updated on: Dec 18, 2022 | 7:17 AM
కోల్డ్ కాఫీ, హాట్ కాఫీలలో ఏది ఆరోగ్యానికి మంచిదనే విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. సాధారణ కాఫీ, టీల కంటే కోల్డ్ కాఫీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కోల్డ్ కాఫీ తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటే..
కోల్డ్ కాఫీ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా దీనిలో కెఫిన్ అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కూడా.
వేడి వేడిగా పొగలుకక్కే కాఫీతో పోల్చితే.. కోల్డ్ కాఫీ తగడం వల్ల కడుపులో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉంటుంది.
కోల్డ్ కాఫీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో వేడి కాఫీకి సమానమైన కెఫిన్ కంటెంట్ కూడా ఉంటుంది.
ఏదైనా మితంగానే తీసుకోవాలి. అందుకు కోల్డ్ కాఫీకి ఎటువంటి మినహాయింపులు లేవు. అతిగా తీసకుంటే మాత్రం పలు సమస్యలు తప్పవు.