Andhra Pradesh: వెరైటీ మోసగాడు.. డిఫరెంట్ చీటింగ్..! ఇలాంటి దొంగలు కూడా ఉంటారు మరీ.. జర భద్రం..

బాధితులంతా యువతులు, మహిళలే.! జైలు కి వెళ్ళిన రామ్ చరణ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటాడా... లేక జైలు నుంచి బయటకు వచ్చి షరా మామూలుగానే మోసాలు చేస్తుంటాడా..? వీడి వ్యవహారాలతో విసిగిపోయిన పోలీసులు మాత్రం సీరియస్ గానే ఉన్నారు.

Andhra Pradesh: వెరైటీ మోసగాడు.. డిఫరెంట్ చీటింగ్..! ఇలాంటి దొంగలు కూడా ఉంటారు మరీ.. జర భద్రం..
Variety Cheating
Follow us

|

Updated on: Dec 20, 2022 | 4:18 PM

మహిళలను చూసి చాలామంది కనేస్తారు. కొంతమంది మాయమాటలతో వారిని లోబర్చుకుంటారు. మరికొంతమంది వాళ్ళ ఎమోషన్స్ తో ఆటలు ఆడుకుంటారు. ఇంకొంతమంది ప్రేమ, పెళ్లి పేరుతో వెంటపడి వేధిస్తారు.. నమ్మి వస్తే మోసగించి మొఖం చాటేస్తారు. కానీ, వీడు టోటల్ డిఫరెంట్. అమ్మాయిలు, ఆంటీల పై కనేస్తాడు…కానీ, నీచపు బుద్ధి మాత్రం వాడిది కాదు..కాకపోతే టిప్ టాప్ గా తయారై కనికట్టు మాత్రం చేస్తాడు. మెల్లగా మాయమాటల్లో పెట్టి వాళ్ళను ట్రాప్ చేసి… ముగ్గులోకి దింపుతాడు.. ఇక ఆ తర్వాత వాడి నిజస్వరూపం బయటపెట్టి.. అమాయక ఆడవాళ్ల దగ్గరున్న విలువైన వస్తువులతో ఉడా ఇస్తాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

విశాఖపట్నం జిల్లా లంకెలపాలెం సమీపంలోని వాంబే కాలనీకి చెందిన రామ్ చరణ్ కుమార్ మామూలోడు కాదు. 35 ఏళ్ల రామ్‌చరణ్‌ మోసాలకు బాగా అలవాటుపడ్డాడు. అందుకోసం టిప్ టాప్ గా రెడీ అవుతాడు. కార్పొరేట్ లుక్‌లో కనిపిస్తాడు. కానీ, ఆదాయం కోసం మాత్రం మహిళలను మాయమాటల్లో పెట్టి మోసం చేయడమే వాడి టార్గెట్. వాడి వ్యవహారం మామూలుగా ఉండదు. రోడ్ల పైన, ఆటోల కోసం వేచి ఉన్న మహిళలో, లేక బస్టాండ్ లోనో, పబ్లిక్ ప్లేస్ లోనూ వేచి ఉన్న మహిళలపై కనేస్తున్న ఈ కేటుగాడు… వాళ్లతో నెమ్మదిగా మాటలు కలుపుతాడు. కాస్త వీడి మాటల్లో పడి కలిశారో వాళ్ళ పని అంతే..! నిరుద్యోగులై, ఉద్యోగం కోసం వేచి చూస్తున్నా వారు, ఏ ఆధారం లేక ఉద్యోగం చేసి పిల్లలు, కుటుంబాన్ని పోషించుకేవాళ్లను ఎంచుకుంటాడు. మహిళలు, అమ్మాయిల వీక్నెస్ ను క్యాష్ చేసుకొని వాళ్లని ఉచ్చులోకి దింపి.. పని కానిచ్చేస్తాడు.

మాట కలిపిన వారి మస్కా కొట్టిస్తాడు.. తనకు ఎన్నో ప్రైవేట్ సంస్థలు తెలుసునని, అందులో మీలాంటి వారికి ఉద్యోగాలు ఉన్నాయని… ఇంటర్వ్యూ సంగతి కూడా తానే చూసుకుంటానని నమ్మిస్తాడు. మరికొంతమందికి తనకే సంస్థలు ఉన్నాయని… మీలాంటి వారి కోసమే ఉద్యోగాలు కల్పిస్తున్నానని చెప్పి ట్రాప్ చేస్తాడు. వాడి మాటల్లో పడిన మహిళలు, యువత నిజమేనని నమ్మేస్తారు. ఓ ఫైన్ డే వాళ్లకు డేట్ ఫిక్స్ చేస్తాడు.. ఫలానా రోజు.. ఫలానా టైం.. ఫలానా ప్లేస్.. ఇంటర్వ్యూకు రావాలని ఆఫర్ చేస్తాడు. అక్కడికి వెళ్లేసరికి అప్పటికి రామ్ చరణ్ వేచి చూస్తాడు. వాడిని చూడగానే ఇప్పుడు తమకు ఉద్యోగం ఖాయమని అనుకుంటారు వాడిని నమ్మి వచ్చిన అమ్మాయిలు, మహిళలు. బయట హడావిడిగా తిరుగుతాడు.

ఇవి కూడా చదవండి

మహిళలు రాగానే హడావిడి చేస్తాడు. ఆలస్యమైంది త్వరగా ఇంటర్వ్యూ కి వెళ్లాలని సూచిస్తాడు. సర్టిఫికెట్స్ అన్ని ఉన్నాయని ప్రశ్నిస్తాడు. జిరాక్స్‌లు కావాలని హడావిడి చేస్తాడు. అన్ని అయ్యాక.. లోపలికి వెళ్దామని అనుకున్న సమయంలో… ఆగండి..ఆగండి..! ఒంటిపై అన్ని ఆభరణాలు వేసుకొని వెళ్తే.. ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉంటుందా..! కొంచెం కూడా ఆలోచించలేరా..? అంటూ ఎమోషనల్ గా మౌల్డ్ చేస్తాడు రామ్ చరణ్. ఉద్యోగం ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యేందుకు హడావిడిలో ఉన్న మహిళలు… ఆభరణాలు తీసి అతని చేతిలో పెడతారు. ఇక అంతే. దాంతో వారికి ఇక మూడినట్టే. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా అతగాడు.. తన చేతికొచ్చిన ఆభరణాలు తీసుకొని ఉడాయిస్తాడు. తీరా లోపలికి వెళ్లి బయటకు వచ్చిన ఆ బాధితులకు.. ఉద్యోగమూ ఉండదు.. ఆభరణాలు గోవిందా..!

ఇలాగే అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నర్సింగబిల్లి ప్రచారం చెందిన బుర్రమ్మ అనే మహిళ.. గాజువాక వెళ్లేందుకు అనకాపల్లి ఆటో స్టాండ్ వద్ద వేచి చూస్తోంది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆమెతో పరిచయం చేసుకుని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం ఉందని నమ్మించాడు. ఆమెతోపాటు గాజువాక వచ్చి… ఉద్యోగ దరఖాస్తు కోసం పాస్పోర్ట్ ఫోటో అవసరమని స్టూడియో కు తీసుకువెళ్లాడు. అక్కడ ఫోటో కూడా చేయించాడు. ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి.. ఇంటర్వ్యూ ఉందన్నాడు. లోపలకు వెళ్తున్న సమయంలో.. ఉద్యోగం కోసం వెళ్తున్నారు. సమయంలో మెడలో బంగారం ఉండకూడదని చెప్పి ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల మంగళసూత్రం, 4 తులాల హారం, రెండు తులాల గొలుసును తీసుకున్నాడు. వాడిని తన వద్ద ఉంచుతానని చెప్పి మాయలో పెట్టాడు. కార్యాలయం లోపలికి వెళ్లి ఇప్పుడే తిరిగి వస్తానని చెప్పాడు. నీ ఉద్యోగం కోసమే మాట్లాడి వస్తానని నమ్మించాడు. ఆమెను బయట వచ్చి ఆభరణాలతో లోపలికి వెళ్లి అక్కడ నుంచి మూడో బండికి తెలియకుండా పారిపోయాడు. ఆభరణాలు తీసుకున్న వ్యక్తి ఇంటర్ కోసం అని తెచ్చి ఎంతకీ రాకపోవడంతో… బాధితురాలు మోసపోయారని గుర్తించింది. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలు ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు.. దర్యాప్తు చేశారు. ఈ తరహా నేరాలు ఎవరు చేసి ఉంటారా అనేదానిపై కూపి లాగారు. అప్పటికి గానీ పోలీసులకు.. వాడి వ్యవహారం తెలియలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి నేరాలు చేస్తున్న ఒకే ఒక్కడు అని తెలుసుకున్నారు పోలీసులు. ట్రాక్ చేసి రామ్ చరణ్ ను పట్టుకున్నారు. వాడి నుంచి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని.. కటకటాల వెనక్కి నెట్టారు. ఈ మేరకు ఏసీపీ త్రినాధరావు వివరాలు వెల్లడించారు.

అయితే వీడిపై విశాఖతోపాటు రాష్ట్రంలోనే చాలా చోట్ల వేర్వేరు జిల్లాలో కేసులు ఉన్నాయి. విశాఖ గాజువాక లో మూడు, ఫోర్త్ టౌన్ లో రెండు, ఎంవిపి, కంచరపాలెం పిఎస్ లలో ఒక్కో కేసు, అనకాపల్లి పోలీస్ స్టేషన్లో మూడు కేసులు ఉన్నాయి. అంతేకాదు విజయనగరం జిల్లా గంట్యాడ పీఎస్ లో ఒకటి, విజయవాడలో మరో రెండు, తునిలో ఒకటి, రాజమండ్రిలో మరో రెండు కేసులు కూడా వీడిపై ఉన్నాయి. విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ సీట్ కూడా రామ్ చరణ్ పై ఉంది. అంతేకాదు గాజువాక రాజమండ్రి కేసులలో రెండేసి ఏళ్ళ జైలు శిక్షలు కూడా అనుభవించాడు. ఎంవిపి పిఎస్ కేసులో మూడు నెలల జైలు జీవితం గడిపాడు. అయినా వాడి బుద్ధి మారలేదు. మళ్లీ బయటకు వచ్చి అనకాపల్లి మహిళను మోసం చేసి మళ్లీ లోపలికి వెళ్ళాడని అంటున్నారు డిసిపి ఆనంద రెడ్డి.

ఇదీ రామ్ చరణ్ కుమార్ వ్యవహారం..! బాధితులంతా యువతులు, మహిళలే.! జైలు కి వెళ్ళిన రామ్ చరణ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటాడా… లేక జైలు నుంచి బయటకు వచ్చి షరా మామూలుగానే మోసాలు చేస్తుంటాడా..? వీడి వ్యవహారాలతో విసిగిపోయిన విశాఖ పోలీసులు.. ఈసారి మాత్రం పోలీసులు చాలా సీరియస్ గానే తీసుకున్నారట.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్