Avuku Project: అవుకు రెండో టన్నెల్‌ పనులు పూర్తి.. రాయలసీమ సస్యామలమే లక్ష్యంగా వడివడిగా అడుగులు

గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం వరద కాలువలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌లో మిగిలిన పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. దాంతో ప్రస్తుత డిజైన్‌ మేరకు వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది.

Avuku Project: అవుకు రెండో టన్నెల్‌ పనులు పూర్తి.. రాయలసీమ సస్యామలమే లక్ష్యంగా వడివడిగా అడుగులు
Avuku Reservoir
Follow us
Surya Kala

|

Updated on: Dec 15, 2022 | 9:08 AM

రాయలసీమ సస్యామలమే లక్ష్యంగా సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు గాలేరు నగరి సుజల స్రవంతి పనులను వేగవంతం చేశారు. ఈ పథకంలోని వరద కాలవలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ పనులు పూర్తయ్యాయి. గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడాన్ని, బ్రహ్మంసాగర్‌ మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేసే పనులను ప్రాధాన్యతగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. సుమారు వెయ్యి కోట్లు వ్యయం చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా గండికోట రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో అంటే 26.85 టీఎంసీలను నిల్వ చేశారు. 250 కోట్లు వ్యయం చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో పది టీఎంసీలకుగాను పది టీఎంసీలు, పైడిపాలెం రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 6 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.

ఆయకట్టుకు పూర్తి స్తాయిలో నీటిని అందిస్తున్నారు. బ్రహ్మంసాగర్‌ మట్టికట్టకు లీకేజీలు ఉన్న ప్రాంతంలో వంద కోట్లతో డయాఫ్రమ్‌ వాల్‌ వేసి వాటికి అడ్డుకట్ట వేశారు. తద్వారా 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు. అయితే సీఎం ఆదేశాల మేరకు రెండో టన్నెల్‌లో ఫాల్ట్‌ జోన్‌లో 160 మీటర్ల తవ్వకం పనులను అధికారులు అత్యంత ప్రాధాన్యతగా చేపట్టారు. ఇప్పటికే పూర్తయిన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులకు తోడుగా ప్రస్తుతం పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు జతకలిసింది. అంటే 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి సుజల స్రవంతి వరద కాలువ ద్వారా తరలించడానికి మార్గం సుగమం చేశారు. ఇది ఆయకట్టుకు మరింత మెరుగ్గా నీళ్లందించడానికి దోహదం చేస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..