AP PGCET 2022 తుది దశ సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏపీ పీజీ సెట్-2022 రెండో దశ (ఫైనల్‌) కౌన్సెలింగ్‌ ఫలితాలు బుధవారం (డిసెంబర్‌ 14) విడుదలయ్యాయి. కౌన్సెలింగ్‌కు హాజరైన వారు..

AP PGCET 2022 తుది దశ సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
AP PGCET 2022 Final Phase Results
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 15, 2022 | 8:57 AM

ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏపీ పీజీ సెట్-2022 రెండో దశ (ఫైనల్‌) కౌన్సెలింగ్‌ ఫలితాలు బుధవారం (డిసెంబర్‌ 14) విడుదలయ్యాయి. కౌన్సెలింగ్‌కు హాజరైన వారు అధికారిక వెబ్‌సైట్‌లో సీట్ అలాట్‌మెంట్‌ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్ధులు డిసెంబర్‌ 16వ తేదీలోపు సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయవల్సి ఉంటుంది. కాగా ఫేజ్‌-2 రిజిస్ట్రేషన్ నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 5 వరకు కొనసాగింది. ఆన్‌లైన్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ డిసెంబర్‌ 1 నుంచి 6 జరిగింది. ఫస్ట్‌ దఫాలో రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించినవారు ఫైనల్ దఫా కౌన్సెలింగ్‌కు ఫీజు చెల్లింపులు అవసరం లేకుండానే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇక వీరందరికీ కాలేజ్‌ల వారీగా సీట్ల కేటాయింపు చేసిన తుది జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఏడాది పలు పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కడప-యోగి వేమన యూనివర్సిటీ ఆధ్వర్యంలో పీజీసెట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఏపీ పీజీ సెట్-2022కు సంబంధించిన ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.