RRB Group D Result 2022: ఎట్టకేలకు ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి రాత పరీక్ష ఫలితాల తేదీ విడుదల.. ‘లక్షకుపైగా రైల్వే జాబ్స్‌’

ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి 2019లో (నాలుగేళ్ల క్రితం) 1,03,769 పోస్టులకు నియామకాలకు ఆగస్టు 17 నుంచి అక్టోబర్‌ 11 వరకు ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు..

RRB Group D Result 2022: ఎట్టకేలకు ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి రాత పరీక్ష ఫలితాల తేదీ విడుదల.. 'లక్షకుపైగా రైల్వే జాబ్స్‌'
RRB Group D CBT result
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 15, 2022 | 7:21 AM

ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి 2019లో (నాలుగేళ్ల క్రితం) 1,03,769 పోస్టులకు నియామకాలకు ఆగస్టు 17 నుంచి అక్టోబర్‌ 11 వరకు ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సుమారు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత అక్టోబర్‌లో ఈ పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదలైంది.

ఈ క్రమంలో ఫైనల్ ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి కేంద్రం శుభవార్త తెల్పింది. ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి పరీక్ష ఫలితాలు డిసెంబర్‌ 24న విడుదల చేయనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు డిసెంబర్ 14న విడుదల చేసిన ప్రకటనలో ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు డిసెంబర్‌ 24, అంతకు ముందే ప్రకటించే వీలుందని తెల్పింది. రాత పరీక్ష ఫలితాలతో పాటు, ఫైనల్‌ ఆన్సర్‌ కీని కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

రాత పరీక్షలో మెరిట్‌ సాధించినవారు వచ్చే ఏడాది (2023) జనవరిలో నిర్వహించే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టుకు హాజరుకావల్సి ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్టులు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. ఇలా మూడు దశల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే ఆయా పోస్టులకు ఎంపిక అవుతారు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టుకు సంబంధించిన తేదీలు త్వరలో వెల్లడించనున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. ఇతర సమాచారం ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని అభ్యర్ధులకు రైల్వే శాఖ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.