Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ అకౌంట్ క్షణాల్లో హ్యాక్‌..

ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆన్‌లైన్‌ షాపింగ్‌ వల్ల సైబర్‌ నేరాల బారీన పడుతుంటారు కొందరు వినియోగదారులు. ఇలాంటి ఫ్రాడ్‌లను అరికట్టాలంటే ఆన్‌లైన్‌ షాపింగ్‌పై అవగాహన చాలా..

Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ అకౌంట్ క్షణాల్లో హ్యాక్‌..
Online Shopping Frauds
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 14, 2022 | 1:19 PM

ఈ రోజుల్లో ఏం కావాలన్నా ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. ఇంటి గుమ్మం ముందుకొచ్చి మరీ డెలివరీ చేస్తున్నారు. కాలికి మట్టి అంటకుండా కూర్చున్న చోటుకే అన్ని వచ్చేస్తున్నాయంటే అంతా.. ఆన్‌లైన్‌ షాపింగ్‌ మహత్యమనే చెప్పాలి. పైగా క్రెడిట్‌ పాయింట్స్‌, డిస్కౌంట్లు అఫర్లే.. అఫర్లు. ఐతే ఆన్‌లైన్‌లో షాపింగ్‌ వల్ల ఎన్ని లాభాలున్నాయో.. అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆన్‌లైన్‌ షాపింగ్‌ వల్ల సైబర్‌ నేరాల బారీన పడుతుంటారు కొందరు వినియోగదారులు. ఇలాంటి ఫ్రాడ్‌లను అరికట్టాలంటే ఆన్‌లైన్‌ షాపింగ్‌పై అవగాహన చాలా అవసరం. ముఖ్యంగా ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి..

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

  • మొబైల్‌ నుంచే అధిక శాతం మంది ఆన్‌లైన్‌ ఆర్డర్లు ఇస్తుంటారు. అలాంటప్పుడు పాస్‌వర్డ్‌ల కంటే బయోమెట్రిక్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం బెటర్‌. ఎందుకంటే పాస్‌వర్డ్‌ సులువుగా హ్యాక్‌ చేసే అవకాశం ఉంది. పైగా గుర్తుంచుకోవడం కూడా కష్టం. బయోమెట్రిక్‌ సిస్టం అయితే మీ ఖాతా సురక్షితంగా ఉంటుంది.
      Online Shopping FraudsOnline Shopping Frauds
  • అలాగే ఓటీపీ వంటి పద్ధతులను ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే హ్యాకర్లకు మీ మొబైల్‌కి వచ్చే ఓటీపీని తెలుసుకోవడం అంత సులువుకాదు. ఫోన్‌లోగానీ, ఆన్‌లైన్‌లోగానీ ఎవరికీ ఓటీపీ వివరాలు తెలిపకూడదు.
  • కంప్యూటర్‌/ఫోన్‌ నుంచి ఎవ్వరికీ రిమోట్‌ యాక్సెస్‌ ఇవ్వకూడదు.
  • ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే సమయంలో వీలైనంత వరకు మీ సొంత ఇంటర్నెట్‌ లేదా డేటా నెట్‌వర్క్‌ ఉపయోగించడం బెటర్‌. పబ్లిక్‌ లేదా ఓపెన్‌ వైఫైని ఉపయోగిస్తే పబ్లిక్‌ వైఫై ద్వారా మీ వివరాలను దొంగిలించే అవకాశం ఉంది.

మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.