Financial Planning: ఉద్యోగుల మెడపై కత్తి.. ఇలా చేస్తే గట్టెక్కుతారు!
ఇటువంటి భయాల నేపథ్యంలో ప్రతి ఒక్క ఉద్యోగి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తన ఆదాయాన్ని, ఖర్చులను బేరీజు వేసుకుని పక్కా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి పరిస్థితి ఎదురైన కుటుంబానికి ఇబ్బందుల్లేని విధంగా చూసుకోవాలి.
ఆర్థిక మాంద్యం ఊహాగానాల నేపథ్యంలో అన్ని కంపెనీలు ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారు. టెక్ దిగ్గజాలైన మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీల నుంచి చిన్న చిన్న కంపెనీల వరకూ ఇదే పరంపర కొనసాగుతోంది. అన్ని రంగాల్లోనూ ఉద్యోగ భద్రత కొరవడుతోంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఉంటుందో.. ఎవరిది ఊడుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇటువంటి భయాల నేపథ్యంలో ప్రతి ఒక్క ఉద్యోగి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తన ఆదాయాన్ని, ఖర్చులను బేరీజు వేసుకుని పక్కా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి పరిస్థితి ఎదురైన కుటుంబానికి ఇబ్బందుల్లేని విధంగా చూసుకోవాలి. అందుకు సంబంధించి నిపుణులు సూచించిన కొన్ని అంశాలు మీకోసం..
బీమా ఉంటే ధీమా..
ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా కార్పొరేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. లేకుంటే వ్యక్తిగతంగా అయినా హెల్త్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. దానిలో ఉండే కవరేజ్ ఆపదవేళ ఆదుకుంటుంది.
సేవింగ్స్ తప్పనిసరి..
సంపాదించిన సొమ్ములలో నుంచి కొంత మొత్తాన్ని తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ చేసిన మొత్తాన్ని సురక్షిత పెట్టుబడి పథకాలలో పెట్టుబడి పెట్టుకుంటే మంచిది. ఈక్విటీ, డెబ్ట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టుకోవాలి. తద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది.
బ్యాంక్ బ్యాలెన్స్ ముఖ్యం..
మీ ఖాతాలో లిక్విడ్ క్యాష్ ఉంచుకోవడం అత్యంత అవసరం. నెలవారీ ఆదాయం, ఖర్చులు, అన్నింటినీ లెక్కగట్టి.. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.
ఆదాయాన్ని పెంచుకోవాలి..
మీ వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. అవసరమైతే పిల్లలకు ఆన్లైన్ క్లాసులు చెప్పడం వంటివి చేయచ్చు. అలాగే మీ స్కిల్స్ ని కూడా అప్ గ్రేడ్ చేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..