Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: అదిరిపోయే బిజినెస్ ప్లాన్.. 20 ఏళ్ల వయస్సులో ప్రతి నెలా రూ.10 వేలు సంపాదించండి..

20 సంవత్సరాల వయస్సులో ప్రజలు చదువుతున్నారు. కొత్త ఉద్యోగం ప్రారంభిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆ సమయంలో ఇంట్లో కూర్చొని కొంత ఆదాయం వచ్చినా ఈ వయసులో ఆ మొత్తం కూడా ఎక్కువే అనిపిస్తుంది. 20 ఏళ్ల వయసులో ఇంట్లో కూర్చొని ప్రతి నెలా రూ.10 వేల ఎలా సంపాదించాలో ఇక్కడ తెలుసుకుందాం..

Business Idea: అదిరిపోయే బిజినెస్ ప్లాన్.. 20 ఏళ్ల వయస్సులో ప్రతి నెలా రూ.10 వేలు సంపాదించండి..
Money
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 13, 2022 | 7:51 PM

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ అదనపు సంపాదన కోసం చూస్తున్నారు. సంపాదన లేకుండా జీవించడం చాలా కష్టం అవుతుంది. అదే సమయంలో, ప్రజలు చిన్న వయస్సులో కూడా సంపాదించడానికి మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. కానీ వారికి మంచి సంపాదన అవకాశాలు లభించడం లేదు. అటువంటి పరిస్థితిలో, సంయమనంతో వెతికితే చాలా మార్గాలు లభిస్తాయి. ఈ ఐడియాతో 20 సంవత్సరాల వయస్సు ఉన్నవారు కూడా సులభంగా డబ్బు సంపాదించవచ్చు. తక్కువ మొత్తంలో టార్గెట్ పెట్టుకుని మంచి లాభాలు కూడా పొందవచ్చు. అలాంటి సంపాదన మార్గం గురించి ఈ రోజు మనం తెలుసకుందాం..

అదనపు ఆదాయం..

20 సంవత్సరాల వయస్సు.. చదువుకుంటున్న సమయంలో ఇలాంటి సమయంలో కొత్త ఉద్యోగం ప్రారంభిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆ సమయంలో ఇంట్లో కూర్చొని కొంత ఆదాయం వచ్చినా ఈ వయసులో ఆ మొత్తం కూడా ఎక్కువే అనిపిస్తుంది. 20 ఏళ్ల వయసులో ఇంట్లో కూర్చొని ప్రతి నెలా రూ. 10 వేల ఎలా సంపాదించాలో ఇక్కడ తెలుసుకుందాం.

షేర్ మార్కెట్ ట్రేడింగ్..

వాస్తవానికి, స్టాక్ మార్కెట్ నుంచి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ప్రతి శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్ మూసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌కు నెలలో 22 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ఈ 22 రోజుల నుంచి రెండు రోజుల సెలవులను కూడా తొలగిస్తే.. నెలలో దాదాపు 20 రోజుల పాటు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ జరిగే అవకాశం ఉంది.

టార్గెట్ పెట్టుకోండి.. ప్రతిరోజూ ఇంత మొత్తాన్ని తీసుకోండి

20 సంవత్సరాల వయస్సులో స్టాక్ మార్కెట్ నుంచి ప్రతి నెలా రూ. 10,000 అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా తీసుకుంటే. అప్పుడు రూ. 10,000 మొత్తాన్ని స్టాక్ మార్కెట్ 20 ట్రేడింగ్ రోజులలో విభజించవలసి ఉంటుంది. రోజుకు రూ. 500 వస్తుంది.

ఈ విధంగా డబ్బు సంపాదించండి

స్టాక్ మార్కెట్‌లో కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టి వ్యాపార సమయాల్లో ట్రేడింగ్ చేస్తే.. ప్రతిరోజూ రూ.500 లాభం పొందవచ్చు. స్టాక్ మార్కెట్ నుంచి రోజుకు సగటున రూ. 500 లాభం వస్తే, ఆ నెలలోని 20 పని దినాల్లోనే రూ.10,000 లాభం వచ్చింది.

వాటిని జాగ్రత్తగా చూసుకోండి..

అయితే, ఈ సమయంలో ఎక్కువ లాభదాయకమైన దురాశతో ఎన్నడూ మోసపోకూడదని గుర్తుంచుకోవాలి.  ఇలాంటి సమయంలో నష్టం కూడా ఉండవచ్చు. సంయమనంతో లక్ష్యం ప్రకారం లాభాన్ని ఆర్జిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అదే సమయంలో, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే మొత్తం.. పెట్టుబడి పెట్టే స్టాక్‌పై కూడా శ్రద్ధ వహించాలి.

(నోట్: ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుడి నుండి సమాచారం తీసుకోండి. ఇందులో పెట్టుబడి పెట్టమని టీవీ9కు ఎలాంటి సలహా ఇవ్వదు.)

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం