Christmas Bonus: ఈ మహిళా బాస్ తన ఉద్యోగులకు ఆశ్చర్యపోయే ప్రకటన.. ఒక్కొక్కరికి రూ.80 లక్షల బోనస్
ఉద్యోగంలో ప్రమోషన్, మంచి జీతం కావాలని అందరూ కలలు కంటారు. కానీ అకస్మాత్తుగా అద్భుతమైన బోనస్ లభిస్తే ఇంకేముంది ఎగిరి గంతులేస్తారు. పట్టరాని ఆనందంతో అబ్బితబ్బిబ్బావుతుంటారు..
ఉద్యోగంలో ప్రమోషన్, మంచి జీతం కావాలని అందరూ కలలు కంటారు. కానీ అకస్మాత్తుగా అద్భుతమైన బోనస్ లభిస్తే ఇంకేముంది ఎగిరి గంతులేస్తారు. పట్టరాని ఆనందంతో అబ్బితబ్బిబ్బావుతుంటారు. ఓ మహిళా బాస్ తన ఉద్యోగులకు లక్షలాది రూపాయల బోనస్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. జరిగిన ఓ సమావేశంలో బోనస్‌ను ప్రకటించారు. క్రిస్మస్ సందర్భంగా 10 మంది ఉద్యోగులకు 80 లక్షల రూపాయలు అందించారు. ఇప్పుడు మహిళా బాస్ చేసిన ఈ ప్రకటనసర్వత్రా చర్చనీయాంశమవుతోంది. నిజానికి ఈ మహిళా బాస్ ఆస్ట్రేలియన్ బిలియనీర్ గినా రైన్‌హార్ట్. ఆమె హాంకాక్ ప్రాస్పెక్టింగ్ అనే మైనింగ్, వ్యవసాయ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఈ కంపెనీని తన తండ్రి స్థాపించాడు. ఆమె నికర సంపద $34 బిలియన్లు, ఆస్ట్రేలియా అత్యంత సంపన్నురాలు అని ఒక నివేదిక పేర్కొంది.
గినా రైన్‌హార్ట్ మరొక కంపెనీలో 10 మంది ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించింది. ఈ 10 మంది ఉద్యోగుల్లో ఒక్కొక్కరు రూ.82 లక్షలను బోనస్‌గా అందుకున్నారు. ఈ బోనస్ క్రిస్మస్ సందర్భంగా ప్రకటించారు. బోనస్‌ను అందజేయడానికి ముందు రైన్‌హార్ట్ పెద్ద ప్రకటన చేయబోతున్నానని, అందరు వినేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు చెప్పారు. ఇలా చెప్పినప్పుడు ఆమె బోనస్ గురించి ప్రస్తావించలేదు. మీటింగ్‌లో బోనస్ ఇవ్వాలంటూ ఆమె మాట్లాడడంతో ఉద్యోగులు సైతం నమ్మలేకపోయారు.
ఆమె సంస్థ ఉద్యోగులందరితో సమావేశం ఏర్పాటు చేసి తాను 10 పేర్లను ప్రకటించబోతున్నానని ఉద్యోగులకు చెప్పినట్లు సమాచారం. ఈ వ్యక్తులు క్రిస్మస్ బోనస్‌గా $100,000 (రూ. 82 లక్షలు) అందుకుంటారని తెలిపారు. ఆయన ప్రకటనతో ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బోనస్ పొందిన ఓ ఉద్యోగి మూడు నెలల క్రితమే కంపెనీలో చేరడం ఆశ్చర్యకరం. news.com.au వివరాల ప్రకారం.. కంపెనీ గత 12 నెలల్లో యూఎస్‌డీ 3.3 బిలియన్ల (రూ.190 బిలియన్లకు పైగా) లాభాన్ని ఆర్జించింది. దీని కోసం రైన్‌హార్ట్ రాయ్ హిల్ ఉద్యోగులకు మరో గొప్ప సంవత్సరం అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి