AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insurance Policy: కేవలం రూ.500 ప్రీమియంతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. అద్భుతమైన పాలసీ

ఈ రోజుల్లో వాహనాలపై బయటకు వెళ్లామంటే క్షేమంగా తిరిగి వస్తామా? లేదా ? అనే అనుమానం వచ్చే రోజులివి. ఎందుకంటే దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మనం..

Insurance Policy: కేవలం రూ.500 ప్రీమియంతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. అద్భుతమైన పాలసీ
Personal Accident Insurance
Subhash Goud
|

Updated on: Dec 13, 2022 | 6:50 PM

Share

ఈ రోజుల్లో వాహనాలపై బయటకు వెళ్లామంటే క్షేమంగా తిరిగి వస్తామా? లేదా ? అనే అనుమానం వచ్చే రోజులివి. ఎందుకంటే దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మనం సరిగ్గా వెళ్లినా ఎదురుగా వచ్చే వాహనదారుడు సరిగ్గా వస్తాడన్న నమ్మకం లేదు. నిర్లక్ష్యం, అతివేగం తదితర కారణాల వల్ల దేశంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినా ఎదుటి వ్యక్తి కారణంగా తీవ్ర ప్రమాదాలు తెచ్చిపెడుతుంది. దీంతో ఆస్పత్రుల్లో చేరిన తర్వాత లక్షల్లో గుమ్మరించుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి సందర్బంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉండటం తప్పనిసరి. ఇలాంటి సమయంలో ప్రమాదంలో ప్రాణాలు పోతే కనీసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. ఒక వేళ తీవ్ర గాయాలు అయినా, ఉద్యోగం పోయినా ఇలాంటి టర్మ్‌ ఇన్సూరెన్స్‌లు పనికిరావు. ఇలాంటి సమయంలో ఆర్థికంగా భరోసాగా ఉండేది పర్సనల్‌ యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ.

ప్రమాదంలో గాయపడి పని చేయలేని స్థితిలో ఉన్నవారికి ఈ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ఎంతగానో ఉపయోగపడనుంది.పాక్షిక, శాశ్వత అంగవైకల్యాలకు గురైనప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ మాదిరిగానే ఈ పాలసీలో కుటుంబానికి మొత్తం పరిహారం దక్కేలా ఉంటుంది. అంతేకాదండోయ్‌ కాళ్లు, చేతులు, కంటిచూపు కోల్పోవడం వంటి శాశ్వత వైకల్యాలకు 100 శాతం బీమా వర్తిస్తుంది.

ప్రయోజనాలు:

ప్రమాదాలు జరిగినప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడేదాక సెలవుల్లో ఉండాల్సిందే. అలాంటప్పుడు సమ్‌ అష్యూర్డ్‌లో ఒక్క శాతం వరకూ బీమాదారుడికి చెల్లిస్తారు. అలాగే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత చేయించుకునే వైద్యం, మందులు ఇతర ఖర్చులకూ బీమా కవరేజీ వర్తిస్తుంది. అంతేకాదు అదనంగా తీసుకునే ఆప్షన్స్‌ ద్వారా యాక్సిడెంటల్‌ హాస్పిటల్‌ డైలీ, వీక్లీ అలవెన్స్‌ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. కొన్ని కంపెనీలు వారానికి గరిష్టంగా రూ.20 వేల వరకు చెల్లిస్తుంటాయి. చాలా ఇన్సూరెన్స్‌ సంస్థలు బీమాదారుడు ప్రమాదానికి గురైనప్పుడు వారి పిల్లల చదువు నిమిత్తం కొంత డబ్బును సహాయంగా ఇస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ స్కీమ్‌కు ఎవరెవరు అర్హులు?

ఈ పాలసీ తీసుకునేందుకు 18 నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులు. ఈ పాలసీ తరుచూ వాహనాల్లో ప్రయాణించేవారు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే ఉద్యోగులు, ఇతర పనుల నిమిత్తం వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రీమియం ఎంత చెల్లించాలి?

ఒక్కొక్కరికి లేదా కుటుంబం మొత్తానికి కూడా ప్రమాద బీమా పాలసీని తీసుకునే వెసులుబాటు ఉంది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) తర్వాత చాలా కంపెనీలు ఈ పాలసీలను అందిస్తున్నాయి. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం.. ప్రతి బీమా సంస్థ ఈ పాలసీని ఇవ్వాల్సి ఉంటుంది. రూ.10 లక్షల ప్రమాద బీమా పాలసీకి గరిష్ఠంగా రూ.500-1,000 మధ్య ప్రీమియం ఉంటుంది. ఇందులో మెడికల్‌ ఖర్చులు, పిల్లల చదువు, ప్రమాదం అనంతరం సెలవులకు ఖర్చులు వంటి వాటికి యాడ్‌ ఆన్స్‌ వంటివి ఉన్నాయి. ఎస్బీఐ వంటి ప్రధాన బ్యాంకులు కూడా అతి తక్కువగా రూ.200 ప్రీమియంతో రూ.4 లక్షలకు బీమాను కల్పిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి పాలసీలు ఎంతగానో ఆసరగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

(నోట్‌: ఈ అంశాలు అవగాహన కోసం మాత్రమే. బీమా పాలసీ నిపుణులు, ఇతర వెబ్‌సైట్ల వివరాల ఆధారంగా అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత బీమా కంపెనీలను సంప్రదించండి.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం