Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Best Features 2022: ఈ ఏడాది వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్స్‌ ఇవే..

ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ ఉండనే ఉంటుంది. ఇది లేనిది ఏ ఫోన్‌ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎంతో మంది వాట్సాప్‌ చాటింగ్‌లు, స్టేటస్‌లతో గడుపుతుంటారు..

WhatsApp Best Features 2022: ఈ ఏడాది వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్స్‌ ఇవే..
సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏస్‌ 2, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ కోర్‌, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌2, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌3 మిని, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ట్రెండ్ II, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ట్రెండ్ లైట్‌, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎక్స్‌కవర్‌ 2, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ, సోనీ ఎక్సీపీరియా ఆర్క్‌ ఎస్‌, సోనీ ఎక్సీపీరియా మైరో, సోనీ ఎక్సీపీరియా నియో ఎల్‌, వికో కిక్‌ ఫైవ్‌, వికో డార్క్‌నైట్ జెడ్‌టీ.
Follow us
Subhash Goud

|

Updated on: Dec 13, 2022 | 6:09 PM

ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ ఉండనే ఉంటుంది. ఇది లేనిది ఏ ఫోన్‌ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎంతో మంది వాట్సాప్‌ చాటింగ్‌లు, స్టేటస్‌లతో గడుపుతుంటారు. అయితే 2022 ఏడాదిలో వాట్సాప్‌లో ఎన్నో అద్భుతమైన ఫీచర్స్‌ వచ్చాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్ల కోసం అనేక ఫీచర్స్‌ను తీసుకువచ్చింది వాట్సాప్‌సంస్థ. వాట్సాప్ గ్రూప్ కాల్‌లో ఎక్కువ మంది పాల్గొనేలా వీడియో కాలింగ్‌ ఫీచర్ మెరుగుపర్చింది. అలాగే వాట్సా్‌ప్‌ ఇన్‌-చాట్‌ పోల్స్‌ వంటి అద్భుతమైన ఫీచర్స్‌ను తీసుకువచ్చింది. వాట్సాప్‌ ఈ సంవత్సరం అందించిన అత్యుత్తమ ఫీచర్లలోఒకటి ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ ఫీచర్. ఇదే కాకుండా మరెన్నో ఫీచర్స్‌ను తీసుకువచ్చింది. 2022 ఏడాదిలో వాట్సాప్ ప్రకటించిన కొన్ని బెస్ట్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

2022లో వాట్సాఫ్‌ తీసుకు వచ్చిన అద్భుతమైన ఫీచర్స్‌ ఇవే..

  1. వాట్సాప్ యాప్‌లో మీ ఆన్‌లైన్ స్టేటస్ సామర్థ్యాన్ని అందిస్తుంది. మీ ఫోన్ సెట్టింగ్‌లలో ఈ ఫీచర్‌ ఎనేబుల్ చేయడం ద్వారా యూజర్ల ఆన్‌లైన్ స్టేటస్ ఇతరలు చూడలేరు. యాప్‌ ప్రైవసీలో ఇదో అద్భుతమైన ఫీచర్‌.
  2. ప్లాట్‌ఫారమ్ ఇప్పటికే స్టేటస్, లాస్ట్ సీన్, ఇతర యూజర్ల వివరాలను హైడ్ చేసేందుకు అనుమతిస్తుంది.
  3. వాట్సాప్ యూజర్లు తమ గ్రూపులలో మెంబర్‌గా ఉండకూడదనుకుంటే గ్రూప్‌ నుంచి ఎగ్జిట్ అయ్యేందుకు అనుమతిస్తుంది. గతంలో గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ కావాలంటే యాప్‌ అందరిని అలర్ట్‌ చేసేది. ఇప్పుడు అలాంటి సమస్య లేదు.
  4. ఇప్పుడు మీరు సైలెంట్‌గా గ్రూప్ నుంచి నిష్క్రమించినా గ్రూప్ అడ్మిన్‌కు తప్ప మిగతా సభ్యులకు తెలియదు.
  5. ఇవి కూడా చదవండి
  6. వాట్సాప్‌ను నోట్‌ప్యాడ్‌గా వాడేందుకు అనుమతించే Message Yourself ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
  7. వాట్సాప్ ప్రాథమికంగా మీ సొంత నంబర్‌తోనే మెసేజ్ పంపేందుకు పర్మిషన్‌ ఇస్తుంది.
  8. యాప్‌లోని నిర్దిష్ట యూజర్ల నుంచి ప్రొఫైల్ ఫొటోను హైడ్ చేయవచ్చు.
  9. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కనెక్ట్ చేసేందుకు అవకాశం.
  10. వాట్సాప్‌లో తెలియని యూజర్ల నుంచి మీ వివరాలను హైడ్ చేయవచ్చు.
  11. ప్రైవసీ కోరుకునే యూజర్లు వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోను హైడ్ చేయాల్సిన అవసరం లేదు.
  12. వాట్సాప్‌లో అత్యంత ఉపయోగకరంగా ఉండే వీడియో కాల్‌ ఫీచర్‌. ఇందులో గరిష్టంగా 32 మంది యూజర్లను యాడ్‌ చేసుకునే సదుపాయం ఉంది.
  13. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్ల కోసం ఎమోజి ఫీచర్స్‌. ఇవి విభిన్న భావోద్వేగాలతో మెసేజ్ రూపంలో రియాక్షన్ ఇచ్చేందుకు ఈ ఫీచర్ ఉపయోగం.
  14. ఈ ఏడాదిలో స్కూళ్లు, వ్యాపారాలు, ఇతర సంస్థల కోసం కొన్ని అదనపు ఫీచర్‌లను యాడ్‌ చేసింది.
  15. వాట్సాప్ ముఖ్యమైన మెసేజ్‌లను పిన్ చేసేందుకు కూడా అనుమతి ఉంటుంది.
  16. యూజర్లు కమ్యూనికేట్ అయ్యేందుకు కమ్యూనిటీలు అనే సెక్షన్ కూడా యాప్‌లో యాడ్ చేసింది.
  17. యాడ్ చేసిన ఇన్-చాట్ పోల్స్ ఫీచర్ కూడా చాలా ప్రయోజనకరం. మీరు చాట్‌లోని అటాచ్‌మెంట్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా పోల్‌లను సులభంగా క్రియేట్ చేయవచ్చు.
  18. వాట్సాప్‌ view once ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఎవరికైనా మెసేజ్‌ చేసిన తర్వాత వారు చూడగానే వెంటనే ఆ మెసేజ్‌ డిలీట్‌ అవుతుంది. దీని వల్ల ఆ మెసేజ్‌లను ఇతరులకు పంపేందుకు, చూసేందుకు ఆస్కారం ఉండదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి