WhatsApp: వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్.. ఎదుటి వారు పంపిన మెసేజ్‌లను ఇకపై అలా చేయలేరు.
ప్రస్తుతం వాట్సాప్ వినియోగం అనివార్యంగా మారిపోయింది. ప్రతీ ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ కచ్చితంగా ఉండాల్సిందే అన్నట్లు పరిస్థితి మారింది. ప్రత్యర్థి కంపెనీల నుంచి వస్తన్న పోటీని తట్టుకునే క్రమంలోనే..
ప్రస్తుతం వాట్సాప్ వినియోగం అనివార్యంగా మారిపోయింది. ప్రతీ ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ కచ్చితంగా ఉండాల్సిందే అన్నట్లు పరిస్థితి మారింది. ప్రత్యర్థి కంపెనీల నుంచి వస్తన్న పోటీని తట్టుకునే క్రమంలోనే వాట్సాప్ నిత్యం ఏదో ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొస్తూనే ఉంది. ఇప్పటికే పలు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. వాట్సాప్ వ్యూ వన్స్ మెసేజ్ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్ ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వాట్సాప్ ఇప్పటికే ఫొటోలు, వీడియోలకు సంబంధించి వ్యూ వన్స్ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఫొటో లేదా వీడియోను ఒకసారి చూడగానే డిలీట్ అయ్యేలా ఈ ఫీచర్‌ను రూపొందించారు. అంటే మీరు ఎదుటి వారికి పంపించిన ఫొటో లేదా వీడియోను అవతలి వ్యక్తి మరెవరికీ ఫార్వర్డ్ చేసే అవకాశం లేకుండా చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. చివరికీ స్క్రీన్‌షాట్ తీసుకునే అవకాశం కూడా ఉండదు. అయితే ఇప్పుడు ఇదే ఫీచర్‌ను టెక్ట్స్ మెసేజ్‌లకు కూడా వర్తింపజేస్తూ వాట్సాప్ ఈ వ్యూ వన్స్ మెసేజ్ ఫీచర్‌ను పరిచయం చేయనుంది.
ఈ ఫీచర్ సహాయంతో మీరు ఎవరికైనా పంపించిన మెసేజ్‌ను కేవలం ఒకేసారి చూసేలా చేయొచ్చు. రిసీవర్ మీ మెసేజ్‌ను చూసిన వెంటనే డిసప్పియర్ అవుతుంది. అవతలి వ్యక్తి చాట్ బాక్స్‌లో మెసేజ్ ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుంది. దీంతో మీరు పంపిన మెసేజ్‌ను ఇంకెవరికీ ఫార్వర్డ్ చేయలేరు. దీనికోసం ప్రత్యేకంగా ఓ సెండ్ బటన్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను కొంతమంది ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ ఉపయోగిస్తున్న వారికి అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..