IPhone 13: రూ. 70 వేల యాపిల్ ఐఫోన్ 13ని రూ. 35 వేలకే సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగంటే..
యాపిల్ ఐఫోన్‌కు ఉండే క్రేజే వేరు. రూ. వేలు ఖర్చైనా సరే ఎలాగైనా ఐఫోన్ కొత్త మోడల్‌ను సొంతం చేసుకోవాలని యూజర్లు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ధర విషయంలో చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ తాజాగా..
యాపిల్ ఐఫోన్‌కు ఉండే క్రేజే వేరు. రూ. వేలు ఖర్చైనా సరే ఎలాగైనా ఐఫోన్ కొత్త మోడల్‌ను సొంతం చేసుకోవాలని యూజర్లు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ధర విషయంలో చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐఫోన్ 13పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. యాపిల్ ఐఫోన్ 13 అత్యధికంగా అమ్ముడు పోయిన ఫోన్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఐఫోన్ 13 అసలు ధర రూ. 69,900గా ఉంది అయితే ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 35,399కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇంతకి ఈ ఆఫర్‌ను ఎలా పొందాలంటే.
ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌లో భాగంగా రూ. 3,901 డిస్కౌంట్ పోను ఈ ఫోన్ రూ. 65,999గా ఉంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్‌పై కొనుగోలు చేస్తే రూ. 3000 వరకు అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ధర రూ. 62,999కి వస్తుంది. అదే విధంగా పాత ఐఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 27,600 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఐఫోన్ 13ని రూ. 35,399కే సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 13 ఫీచర్లు..
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్ సూపర్ రెటినీ ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. ఏ15 బయోనిక్ చిప్ ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్‌లో సినిమాటిక్ మోడ్‌ను ప్రత్యేకంగా అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 12 + 12 మెగాపిక్సెల్ డ్యూయల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..