Mobile Recharge: ప్రతీ నెల రీచార్జ్‌ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా.? ఏడాది మొత్తానికి ఒకే ప్లాన్‌ ఆఫర్స్‌..

ప్రతీ నెల మొబైల్ రీచార్జ్‌ చేసుకోవడం కొందరికీ ఇబ్బందిగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇటీవల టెలికాం కంపెనీలు 20 రోజుల వ్యాలిడీతో ఆఫర్లను తీసుకొస్తున్నాయి. దీంతో తక్కువ సమయంలోనే రీచార్జ్‌ ప్లాన్‌ ముగుస్తుంది. ఇలా ప్రతీసారి..

Mobile Recharge: ప్రతీ నెల రీచార్జ్‌ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా.? ఏడాది మొత్తానికి ఒకే ప్లాన్‌ ఆఫర్స్‌..
Recharge Plans
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 13, 2022 | 4:54 PM

ప్రతీ నెల మొబైల్ రీచార్జ్‌ చేసుకోవడం కొందరికీ ఇబ్బందిగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇటీవల టెలికాం కంపెనీలు 20 రోజుల వ్యాలిడీతో ఆఫర్లను తీసుకొస్తున్నాయి. దీంతో తక్కువ సమయంలోనే రీచార్జ్‌ ప్లాన్‌ ముగుస్తుంది. ఇలా ప్రతీసారి రీచార్జ్‌ చేసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అయితే ఒక్కసారి రీచార్జ్‌ చేసుకుంటే ఏడాదంతా వ్యాలిడిటీ ప్లాన్‌ వేసుకుంటే డబ్బులు ఆదా అవ్వడంతో పాటు టెన్షన్‌ పడాల్సిన పని ఉండదు. ఇంతకీ 365 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ ప్రీపెయిడ్ రీచార్జ్‌ ప్లాన్స్‌పై ఓ లుక్కేయండి..

వొడాఫోన్ ఐడియా (వీఐ) రూ. 2899 ప్లాన్..

ఈ ప్లాన్‌ 365 రోజుల వ్యాలిడిటీతో పని చేస్తుంది. ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే రోజుకి 1.5 జీబీ ఇంటర్‌నెట్ డేటాతో పాటు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా అందిస్తారు. దీంతో పాటు అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డేటాను ఉచితంగా పొందొచ్చు.

జియో రూ. 2545 రీచార్జ్‌ ప్లాన్‌..

జియో యూజర్లు రూ. 2545తో రీచార్జ్‌ చేసుకుంటే మొత్తం 504 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 1.5 జీబీ డేటా ఉంటుంది. ఏడాది మొత్తం ప్రతి రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌తో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాప్స్‌ను ఉచితంగా పొందొచ్చు. అయితే రూ. 2879తో ప్లాన్‌ చేసుకుంటే రోజూ 2 జీబీ డేటా పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌టెల్‌ రూ. 1799 ప్లాన్‌..

365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌తో పాటు 24 జీబీ డేటా లభిస్తుంది. 3600 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందొచ్చు. వింక్ మ్యూజిక్, హలో ట్యూన్లను కూడా ఉచితంగా పొందొచ్చు.

ఎయిర్ టెల్ రూ. 2999 ప్లాన్

రూ. 2999తో రీచార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌తో పాటు ప్రతి రోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా ఉంటాయి. వింక్ మ్యూజిక్, హలో ట్యూన్లు కూడా ఉచితమే.

ఎయిర్‌ టెల్ రూ. 3,359..

ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే ఏడాది పాటు రోజుకు 2.5 జీబీ డేటా పొందొచ్చు. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మెబైల్ ఎడిషన్, డిస్నీ హాట్ స్టార్ వెర్షన్‌ ఏడాది పాటు ఉచితంగా పొందొచ్చు. అలాగే అపోలో 24/7 సబ్ స్క్రిప్షన్ మూడు నెలలు ఉచితంగా పొందొచ్చు. హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ ఉచితంగా అందిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే