Snake Farming Business: అదిరిపోయే బిజినెస్ ఐడియా.. పాముల పెంపకంతో కోట్లల్లో వ్యాపారం.. ఏడాదికి 100 కోట్ల సంపాదిస్తున్న ఆ గ్రామం..

పౌల్ట్రీ, చేపల పెంపకం ఎలా జరుగుతుందో.. అదే విధంగా వ్యాపార ప్రయోజనం కోసం పాములను కూడా పెంచుతారు. దీనినే స్నేక్ ఫార్మింగ్ అంటారు. పాము పెంపకం చేసే అనేక దేశాలు ఉన్నాయి. అనేక దేశాల్లో పాములను ఉంచడం కూడా చట్టవిరుద్ధం అయినప్పటికీ..

Snake Farming Business: అదిరిపోయే బిజినెస్ ఐడియా.. పాముల పెంపకంతో కోట్లల్లో వ్యాపారం.. ఏడాదికి 100 కోట్ల సంపాదిస్తున్న ఆ గ్రామం..
Snake Farming
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 13, 2022 | 6:51 PM

భారతదేశంలో పాముపై అనేక నమ్మకాలు ప్రబలంగా ప్రచారంలో ఉన్నాయి. అంతే కాదు పాములను స్నేహితులుగా.. దేవతలుగా చూస్తుంటాం. అయితే అక్కడ మాత్రం అదే పాములు లక్షల కోట్లు సంపాదించి పెడుతున్నాయి. పాములను పెంచడంతో లక్షల్లో సంపాదిస్తున్న దేశాలు చాలానే ఉన్నాయి. ఈ రోజు మనం అలాంటి వ్యాపారం గురించి మీకు తెలుసకుందాం..

కోట్ల వ్యాపారం..

వాస్తవానికి, కోళ్ల పెంపకం, చేపల పెంపకం ఎలా జరుగుతుందో.. అదే విధంగా వ్యాపార ప్రయోజనం కోసం పాములను కూడా పెంచుతారు. దీనినే స్నేక్ ఫార్మింగ్ అంటారు. పాములను పెంచి వాటి విషాన్ని తీయడం.. తీసిన విషాన్ని లక్షలు, కోట్ల రూపాయలకు విక్రయిస్తుంటారు. అనేక దేశాల్లో పాములను ఉంచడం చట్టవిరుద్ధం అయినప్పటికీ చైనాలో మాత్రం కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది.

పాము విషానికి భారీ డిమాండ్

చైనాలోని ప్రజలు పాములను పట్టుకుని దాని విషంతో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. పాము విషానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఎందుకంటే పాము విషాన్ని వివిధ మందులను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అయితే, ఈ వ్యాపారంలో ఎక్కువ రిస్క్ ఉన్నట్లుగానే.. ఎక్కువ లాభం కూడా ఉంటుంది. వీరు వివిధ జాతుల పాములను పెంచుతుంటారు. ఒక లీటరు పాయిజన్ ధర ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉంటుంది.

లాభం ఎక్కువ

ప్రపంచ విష మార్కెట్‌లో పాము విషానికి డిమాండ్ పెరుగుతున్నందున పాము పెంపకం వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంది. దీనికి విరుద్ధంగా, పాములను పట్టుకునే వ్యాపారంలో పాల్గొనే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల సరఫరాలో కూడా కొరత ఉంది. పాము పెంపకం వ్యాపారంలో వాణిజ్య ప్రయోజనాల కోసం వివిధ పాము జాతుల పెంపకం ఉంటుంది. ఒక వ్యక్తి ఈ వ్యాపారం చేయడంలో రిస్క్ తీసుకోగలిగితే.. అది అతనికి చాలా లాభదాయకమైన వ్యాపారం.

ఏటా కోట్లు సంపాదిస్తున్నారు

చైనాలోని జిసికియావో అనే చిన్న గ్రామం పాముల పెంపకానికి ప్రసిద్ధి. ఈ గ్రామం పాముల పెంపకం ద్వారానే ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని పొందుతోంది. ఈ గ్రామం పాము పెంపకం వ్యాపారం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు $ 12 మిలియన్లు (దాదాపు రూ. 100 కోట్లు) సంపాదిస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

రవి మీద శని దృష్టి.. ఆ రాశుల వారికి ఆదాయ, అధికార యోగాలు..!
రవి మీద శని దృష్టి.. ఆ రాశుల వారికి ఆదాయ, అధికార యోగాలు..!
'కష్టకాలంలో అండగా నిలిచారు'..వారికి థ్యాంక్స్ చెప్పిన నారా రోహిత్
'కష్టకాలంలో అండగా నిలిచారు'..వారికి థ్యాంక్స్ చెప్పిన నారా రోహిత్
ఇక్కడ అన్నీ డబుల్ ఓటర్లుగా రికార్డ్‌కి ఎక్కబోతున్న ఆ గ్రామస్తులు
ఇక్కడ అన్నీ డబుల్ ఓటర్లుగా రికార్డ్‌కి ఎక్కబోతున్న ఆ గ్రామస్తులు
ఈ చాయ్‌వాలా నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? అక్షరాలా లక్ష రూపాయలు!
ఈ చాయ్‌వాలా నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? అక్షరాలా లక్ష రూపాయలు!
మీమర్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది..
మీమర్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది..
అమరన్ సినిమా కోసం సాయి పల్లవి ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా?
అమరన్ సినిమా కోసం సాయి పల్లవి ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా?
వాస్తు దోష నివారణకు వెండి ఏనుగు విగ్రహం ఏ దిశలో పెట్టుకోవాలంటే..
వాస్తు దోష నివారణకు వెండి ఏనుగు విగ్రహం ఏ దిశలో పెట్టుకోవాలంటే..
'అమృత' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయిన్ కూతురా? ఇప్పుడెలా ఉందో చూశారా?
'అమృత' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయిన్ కూతురా? ఇప్పుడెలా ఉందో చూశారా?
ఆహా.. ఆ కుక్క ఎంత లక్కీ గురూ..!
ఆహా.. ఆ కుక్క ఎంత లక్కీ గురూ..!
ఫోన్ లాక్ బటన్ పాడైతే డిస్‌ప్లేను ఎలా ఆన్‌ చేయాలి? ఇదిగో ట్రిక్
ఫోన్ లాక్ బటన్ పాడైతే డిస్‌ప్లేను ఎలా ఆన్‌ చేయాలి? ఇదిగో ట్రిక్