AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: ఇదే చివరి అవకాశం.. ఆ తేదీ నుంచి ఈ పాన్‌కార్డులు పని చేయవు.. మరోసారి అలర్ట్ చేసిన ఆదాయపు పన్ను శాఖ

పాన్‌కార్డు.. దీని గురించి అందరికి తెలిసిందే. బ్యాంకు ఖాతా తీయడం నుంచి లావాదేవీలు, ఇతర ఆర్థికపరమైన విషయాలలో పాన్‌ కార్డు ముఖ్య పాత్ర పోషిస్తుంది. పాన్‌కార్డు లేనిది ఆర్థిక విషయాలలో..

Income Tax: ఇదే చివరి అవకాశం.. ఆ తేదీ నుంచి ఈ పాన్‌కార్డులు పని చేయవు.. మరోసారి అలర్ట్ చేసిన ఆదాయపు పన్ను శాఖ
Aadhaar Pan Card
Subhash Goud
|

Updated on: Dec 13, 2022 | 3:47 PM

Share

పాన్‌కార్డు.. దీని గురించి అందరికి తెలిసిందే. బ్యాంకు ఖాతా తీయడం నుంచి లావాదేవీలు, ఇతర ఆర్థికపరమైన విషయాలలో పాన్‌ కార్డు ముఖ్య పాత్ర పోషిస్తుంది. పాన్‌కార్డు లేనిది ఆర్థిక విషయాలలో ఎలాంటి పనులు జరగవు. అయితే ఇక ఆధార్‌ గురించి మాట్లాడితే.. ప్రతి అవసరానికి అవసరం పడేది ఆధారే. ఇది లేనిది ఏ పని జరగదు. సిమ్‌ కార్డు తీసుకోవడం నుంచి బ్యాంకులు, ఇతర ఆర్థిక విషయాలలో కూడా ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరి. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ ఆధార్‌ లింకు చేసుకునేందుకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. తాజాగా ఆధార్‌తో అనుసంధానించడం గడువు వచ్చే ఏడాది మార్చి 31 చివరి తేదీ. ఈలోగా ఈ ప్రక్రియ పూర్తి చేకుంటే మీ పాన్‌కార్డు చెల్లదు. ఈ విషయాన్ని ఐటీ శాఖ మరోసారి గుర్తు చేస్తూ ట్విటర్‌ ద్వారా తెలియజేసింది.

ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం.. వినియోగదారులందరూ తమ పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని కోరింది. ఒకవేళ అనుసంధానించకుంటే 2023 మార్చి 31 తర్వాత మీ పాన్‌కార్డు నిరూపయోగంగా మారనుంది. సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ పని పూర్తి చేసుకోవాలని ట్విట్టర్‌ ద్వారా కోరింది.

ఇవి కూడా చదవండి

వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో..

పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలంటే మీరు వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో పెనాల్టీ ఛార్జీలతో అనుసంధానించుకునేందుకు ఈ గడువు విధించింది. ఈ పని పూర్తి చేసుకోకుంటే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

పెనాల్ట ఛార్జీలు ఎలా చెల్లించాలి?

☛ పాన్‌- ఆధార్‌ అనుసంధానానికి ముందు మీరు పెనాల్టీ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసం egov-nsdl.com అనే వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

☛ ఇందులో Tax applicable – (0021) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

☛ తర్వాత పాన్‌ వివరాలతో పాటు అక్కడ అడిగిన ఇతర వివరాలను నమోదు చేయాలి.

☛ తర్వాత క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి పేమెంట్‌ ఎంచుకుని పూర్తి చేసుకోవాలి.

☛ ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో పాన్‌ ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఆధార్-పాన్‌ లింక్‌ చేయడం ఎలా..?

☛ ముందుగా ఆదాయపు పన్ను వెబ్‌సైట్ కి వెళ్లండి.

☛ ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ను తెరిచిన తర్వాత ఆధార్‌ లింక్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీ స్క్రీన్‌పై కొత్త పేజీ తెరవబడుతుంది.

☛ ఇప్పుడు ఇక్కడ మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలతో పాటు మీ పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

☛ మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత I Validate my Aadhaar వివరాలను క్లిక్ చేసి కొనసాగించండి.

☛ దీని తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని నమోదు చేసిన తర్వాత ధృవీకరించుపై క్లిక్ చేయండి. ఇలా ఆలస్య రుసుము చెల్లించి ఈ ప్రాసెస్‌ తర్వాత మీ ఆధార్-పాన్ లింక్ చేయబడతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం