Indian Railways: సర్క్యులర్ టికెట్ అంటే ఏమిటి..? ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది..? రైల్వే ప్రయాణికులకు అద్భుతమైన సదుపాయం

భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటాయి. పండుగ సీజన్‌లో కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యేక రైళ్లను నడిపారు. వస్తువుల..

Indian Railways: సర్క్యులర్ టికెట్ అంటే ఏమిటి..? ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది..? రైల్వే ప్రయాణికులకు అద్భుతమైన సదుపాయం
Indian Railway
Follow us
Subhash Goud

|

Updated on: Dec 13, 2022 | 8:11 PM

భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటాయి. పండుగ సీజన్‌లో కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యేక రైళ్లను నడిపారు. వస్తువుల పార్శిల్, ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్, సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ తదితర సౌకర్యాలను రైల్వే కల్పిస్తోంది. తత్కాల్ బుకింగ్ సేవను కూడా రైల్వే కాన్ఫర్మ్ టికెట్ బుకింగ్ కోసం అందిస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల కోసం ఒక సర్క్యులర్ టికెట్ సౌకర్యాన్ని అందిస్తుంది. దీని సాయంతో ఒకే ప్రదేశానికి ప్రయాణించవచ్చు. దీని కోసం వివిధ ప్రాంతాలకు టిక్కెట్లు బుక్ చేసుకునే ఇబ్బంది తొలగిపోతుంది. ప్రయాణికులచే ఎంపిక చేయబడిన, చివరిగా ప్రయాణం ప్రారంభించిన అదే స్టేషన్‌లో ముగిసేలా ఈ టిక్కెట్‌లను రైల్వే జారీ చేస్తుంది.

సర్క్యులర్ టికెట్ అంటే ఏమిటి ?

మీరు తీర్థయాత్రలు లేదా వివిధ ప్రాంతాల సందర్శన కోసం అనేక ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్‌ చేస్తుంటే ఇండియన్‌ మీకు సర్క్యులర్ టికెట్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ టికెట్‌ అన్ని వర్గాలకు జారీ చేస్తుంది. వృత్తాకార ప్రయాణ టిక్కెట్‌ను జారీ చేయడానికి ముందు సర్క్యులర్ టికెట్ కోసం ప్రయాణికులు.. విరామ ప్రయాణం కోసం గరిష్టంగా ఎనిమిది స్టేషన్లు తెలియజేయాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ దూరం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ టిక్కెట్ తీసుకుంటే వివిధ స్టేషన్ల నుండి టిక్కెట్లను బుక్ చేయవలసిన అవసరం లేదు. మీరు మీ షెడ్యూల్ ప్రకారం ఒక టిక్కెట్ కొనుగోలు చేస్తే సరిపోతుంది. అయితే ఈ ఒక్క టికెట్ వివిధ రైళ్లలో చెల్లుబాటు అవుతుంది. సర్క్యులర్ టిక్కెట్ చెల్లుబాటు అనేది ప్రయాణ రోజులు, విరామ ప్రయాణ రోజులను పరిగణనలోకి తీసుకొని నిర్ధారిస్తారు రైల్వే అధికారులు. టిక్కెట్‌పై పేర్కొన్న ప్రయాణ తేదీ నుండి టిక్కెట్ చెల్లుబాటు అవుతుంది. విరామ సమయంలో ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎలాంటి పరిమితి లేదు.

ప్రయాణ టిక్కెట్లను జోనల్ రైల్వేల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది పర్యాటకుల సౌలభ్యం కోసం ప్రధాన ప్రదేశాలను కవర్ చేస్తుంది. బుకింగ్ సమయంలో గమ్యం, ప్రయాణం ఆధారంగా టికెట్ ధర నిర్ణయించబడుతుంది. ప్రయాణికుడు రైల్వేలు ఇచ్చిన రూట్ ప్రకారం సరిపోతుంటే మీరు దానిని కొనుగోలు చేయవచ్చు. లేకపోతే జోనల్ రైల్వే వారి ప్రయాణం గురించి తెలియజేయవచ్చు. అతను మీ సౌకర్యాన్ని బట్టి టిక్కెట్లు ఇస్తాడు.

ఇవి కూడా చదవండి

సర్క్యులర్ టిక్కెట్ ధర ఎంత?

సర్క్యులర్ టికెట్ అనేది ప్రయాణంలోని వివిధ దశలకు రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్ ఫాస్ట్ రైళ్లను బట్టి ఛార్జీలు ఉంటాయి. ప్రయాణికుడు హై క్లాస్ రైళ్లలో ప్రయాణిస్తే, అతను పాయింట్-టు-పాయింట్ ప్రాతిపదికన టిక్కెట్ రుసుము చెల్లించాలి. అలాగే ఈ ప్రయాణ టిక్కెట్ అదనపు ఖర్చులను తగ్గిస్తుంది. దీనితో పాటు ప్రయాణ సమయంలో ఎక్కడి నుండైనా రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే సమస్యను కూడా ఇది తొలగిస్తుంది. ఈ టిక్కెట్‌లతో మీరు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ప్రయాణంలో ప్రతి అడుగు కోసం టిక్కెట్లను బుక్ చేసుకోవడంలో ఇబ్బందిని కూడా దూరం చేసుకోవచ్చు. కాగా, ప్రయాణ మార్గాలను నిర్ణయించుకున్న తర్వాత కొన్ని ప్రధాన స్టేషన్‌ల డివిజన్‌కు చెందిన డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌ను సంప్రదించి ఈ టికెట్‌ను తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?