AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు హెచ్చరిక.. 6.5 కోట్ల మందిని అప్రమత్తం చేసిన సంస్థ.. ఎందుకో తెలుసా?

ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో అప్రమత్తం చేస్తోంది. ఈపీఎఫ్‌వో 6.5 కోట్ల మంది ఉద్యోగులకు సమాచారం అందిస్తోంది. పీఎఫ్‌ ఖాతా కింద కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. దీన్ని..

EPFO: ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు హెచ్చరిక.. 6.5 కోట్ల మందిని అప్రమత్తం చేసిన సంస్థ.. ఎందుకో తెలుసా?
నామినీ కోసం: ఆధార్ కార్డు, స్కాన్ చేసిన ఫోటో, బ్యాంకు ఖాతా సంఖ్య, IFSC కోడ్, చిరునామా రుజువు లాంటివి తప్పనిసరి.
Follow us
Subhash Goud

|

Updated on: Dec 13, 2022 | 8:42 PM

ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో అప్రమత్తం చేస్తోంది. ఈపీఎఫ్‌వో 6.5 కోట్ల మంది ఉద్యోగులకు సమాచారం అందిస్తోంది. పీఎఫ్‌ ఖాతా కింద కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సైబర్ నేరాల గురించి సభ్యులను అప్రమత్తం చేసింది. పీఎఫ్ ఖాతా పేరుతో అనేక మోసాల కేసులు తెరపైకి వచ్చినట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. మోసగాళ్లు ఈపీఎఫ్‌వో (ఈపీఎఫ్‌వో న్యూస్‌) పేరుతో వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌ల ద్వారా అడిగేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో పీఎఫ్‌దారులు​అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈపీఎఫ్‌వో ఉద్యోగుల పదవీ విరమణ కోసం తమ నిధిని సేకరిస్తుంది. దీని కింద కంపెనీ, ఉద్యోగి ఇద్దరి తరపున డబ్బు జమ చేయబడుతుంది. ఈపీఎఫ్‌ ఖాతా కింద, ఉద్యోగుల ప్రాథమిక వేతనం నుండి 12 శాతం మొత్తం తీసివేస్తుంది. అదే మొత్తం కంపెనీ నుండి జమ చేస్తుంది. ప్రతి నెలా జమ చేసిన ఈ మొత్తంపై సంవత్సరానికి 8.1% వడ్డీ అందుకోవచ్చు. పదవీ విరమణ వయస్సు వచ్చినప్పుడు మొత్తం ఉద్యోగులకు చెల్లించబడుతుంది.

ఇవి కూడా చదవండి

అలాంటి సందేశాలు, కాల్‌లపై అప్రమత్తంగా ఉండండి:

మీకు ఈపీఎఫ్‌​నుండి సందేశం లేదా కాల్ వచ్చినట్లయితే అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే అది మిమ్మల్ని మోసం చేసేందుకు కావచ్చు. ఆధార్ కార్డ్, పాన్ నంబర్, యూఏఎన్‌, పాస్‌వర్డ్ గురించి సమాచారం ఇస్తూ ట్వీట్‌ చేసింది. కంపెనీ ఖాతా నంబర్, ఓటీపీ, వ్యక్తిగత సమాచారాన్ని కూడా అడగదు. ఇది కాకుండా వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ద్వారా అలాంటి విషయాలను పంచుకోమని కూడా అడగదని తెలిపింది. అలాంటి మెసేజ్‌లకు రిప్లై ఇవ్వవద్దని హెచ్చరించింది. పొరపాటున మీ వివరాలు తెలిపినట్లయితే తీవ్రంగా మోసపోతారని హెచ్చరించింది. ఇలాంటివి దేశంలో చాలా జరుగుతున్నాయని, కస్టమర్‌ కేర్‌ నుంచి అంటూ మాట్లాడుతూ ఓటీపీ, ఆధార్‌, యూఏఎన్‌ నెంబర్లను తెలుసుకుని మోసగిస్తున్నారని తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి