- Telugu News Photo Gallery LPG Cylinder Rules: Insurance policy for lpg cylinder blast know how to get policy claim
LPG Cylinder Rules: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిందా..? పరిహారం ఎలా పొందాలో తెలుసుకోండి
కట్టెల పొయ్యిపై వంట చేసే రోజులు పోయాయి. ప్రస్తుతం అందరికీ ఎల్‌పీజీ కనెక్షన్ ఉంది. అయితే చాలా సార్లు గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తూ పేలి మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఆస్తినష్టం, ప్రాణ నష్టం ..
Updated on: Dec 13, 2022 | 9:02 PM

కట్టెల పొయ్యిపై వంట చేసే రోజులు పోయాయి. ప్రస్తుతం అందరికీ ఎల్‌పీజీ కనెక్షన్ ఉంది. అయితే చాలా సార్లు గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తూ పేలి మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరుగుతుంటుంది. ఈ సందర్భంలో పరిహారం కూడా ఎల్‌పీజీ కంపెనీ ద్వారా అందుకోవచ్చు. ఈ సమాచారం చాలా మందికి తెలియదు. దీంతో ప్రమాదం జరిగినా పరిహారం అందడం లేదు.

ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ సమయంలో కస్టమర్లందరికి కంపెనీచే బీమా సదుపాయం ఉంటుంది. దీనిని ఎల్‌పీజీ బీమా కవర్ పాలసీ అంటారు. ప్రమాదవశాత్తు సిలిండర్ లీకేజీ, పేలుడు సంభవించినట్లయితే అందుకు నష్టాన్ని బట్టి పరిహారం అందుకోవచ్చు.

ఎల్‌పీజీ కంపెనీ ద్వారా ప్రతి వినియోగదారుడు 50 లక్షల రూపాయలకు బీమా పొందవచ్చు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి, వినియోగదారుడు లేదా అతని కుటుంబ సభ్యులెవరైనా గాయపడినా లేదా ఆస్తి నష్టం జరిగినా, ప్రమాదవశాత్తూ రూ.40 లక్షల వరకు పరిహారం పొందవచ్చు.

పేలుడు వల్ల ప్రాణనష్టం జరిగితే రూ.50 లక్షల వరకు పరిహారం పొందవచ్చు. అలాగే ప్రమాదంలో గానీ, పేలుళ్లలో గానీ ప్రాణ నష్టం జరగకపోయినా, ఆస్తినష్టం జరిగినా రూ.2 లక్షల పరిహారం పొందవచ్చు.

అయితే బీమా పరిహారం పొందడానికి ఒక షరతు ఏమిటంటే ఎల్‌పీజీ సిలిండర్ ఎవరి పేరు మీద కనెక్ట్ చేయబడిందో వారికి మాత్రమే బీమా డబ్బు వస్తుంది. ఈ బీమాకు నామినీ లేనందున కస్టమర్ కుటుంబంలో మరెవరూ బీమా మొత్తాన్ని లేదా పరిహారం అందుకోరు.




