Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Loan EMI: కార్‌ లోన్‌ కట్టలేకపోతున్నారా? కష్టపడకండి.. ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి చాలు!

కారు కొన్న మొదట్లో ఉత్సాహంగానే అనిపించినా.. తర్వాత ఈఎంఐ భారం అధికమయ్యి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొంతమంది ఉన్న కారు అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరూ ఆ ఈఎంఐలు కట్టేందుకు కొత్త అప్పులు చేస్తూ.. అవస్థలు పడుతున్నారు.

Car Loan EMI: కార్‌ లోన్‌ కట్టలేకపోతున్నారా? కష్టపడకండి.. ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి చాలు!
Bank Car Loan
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 14, 2022 | 12:36 PM

కరోనా నేర్పిన కల్చర్‌లో వ్యక్తిగత ప్రయాణాలకు ప్రాధాన్యం పెరిగింది. సామూహికంగా బస్సులు, రైళ్లలో ప్రయాణించడాన్ని తగ్గేలా చేసింది. తద్వారా కారు ప్రయాణాలకు డిమాండ్‌ పెరిగింది. అది కూడా అద్దె కారుల్లో వెళ్లే కన్నా.. సొంత కారు ఉంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన అందరిలోనూ కల్గించింది. ఫలితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చిన్నదో పెద్దదో కారు కొనుగోలు చేస్తున్నారు. దాని కోసం కార్‌ లోన్‌లు తీసుకుంటున్నారు. వాటిని తీర్చేందుకు ఈఎంఐ కట్టాల్సిన అనివార్యత. కారు కొన్న మొదట్లో ఉత్సాహంగానే అనిపించినా.. తర్వాత ఈఎంఐ భారం అధికమయ్యి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొంతమంది ఉన్న కారు అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరూ ఆ ఈఎంఐలు కట్టేందుకు కొత్త అప్పులు చేస్తూ.. అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కారు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఈఎంఐలు కట్టేటప్పుడు కాస్త స్మార్ట్‌ గా ఆలోచిస్తే.. ఇటువంటి ఇబ్బందులన్నీ తప్పుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

మీ స్థాయికి తగిన కారు..

కారు కొనే ముందు కొన్ని విషయాలు మీరు ఆలోచించుకోవాలి. మీ ఆర్థిక స్థితి, ఈఎంఐలు కట్టగలిగే సామర్థ్యం అన్ని బేరీజు వేసుకోవాలి. అందుకు తగిన కారునే ఎంపిక చేసుకోవాలి. మీ శక్తికి మించిన కారును కొనుగోలు చేస్తే ఇబ్బందులు తప్పవు.

ఈఎంఐ కన్నా ఎక్కువ చెల్లించాలి..

కార్‌ లోన్‌ తీసుకున్నప్పుడు నెలవారీ ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది. అలా కట్టేటప్పుడు అవకాశం ఉంటే ఈఎంఐ మొత్తం మీద ఎంతో కొంత మొత్తం అధికంగా చెల్లిస్తే.. లోన్‌ కాల పరిమితితో పాటు వడ్డీ భారం తగ్గుతుంది. ఉదాహరణకు మీ ఈఎంఐ నెలకు రూ. 14,500 అనుకుంటే మీరు నెలకు రూ. 15000 చెల్లించారనుకోండి. అంటే అది కేవలం రూ. 500లే ఎక్స్‌ట్రా కాబట్టి పెద్దగా భారం అనిపించదు. కానీ సంవత్సరం చివరకు వచ్చే సరికి అది రూ. 6000 అవుతుంది. అది అసలుకు జమఅవుతుంది కాబట్టి వడ్డీ భారం తప్పుతుంది.

ఇవి కూడా చదవండి

తగినంత డౌన్‌ పేమెంట్‌ చేయాలి..

కారు కొనేటప్పుడు అవకాశం ఉన్నంత వరకూ డౌన్‌పేమెంట్‌ అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఉదాహరణకు రూ. 10 లక్షలు పెట్టి కారు కొంటే అందులో సగం అంటే రూ. 5లక్షలు డౌన్‌ పేమెంట్‌ చేస్తే మీపై ఈఎంఐల భారం అధికంగా ఉండదు.

లోన్‌ ప్రీ పేమెంట్‌ ఆప్షన్‌..

కారు లోన్‌ తీసుకున్న తర్వాత మీ చేతిలో కొంత నగదు వచ్చిందనుకోండి.. ఆసమయంలో లోన్‌ ప్రీ పేమెంట్‌ చేసేందుకు మొగ్గుచూపాలి. తద్వారా అప్పు త్వరితగతిన పూర్తయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే లోన్‌ తీసుకునేముందే ప్రీపేమెంట్‌ ఆప్షన్‌ ఉందో లేదో పైనాన్షియర్‌ను అడిగి నిర్ధారించుకోవాలి. లేకుంటే లోన్‌ ప్రీపేమెంట్‌ చేస్తే వారు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది.

అనవసర ఖర్చులు తగ్గించాలి..

మనకున్న ఆర్థిక అవసతలను బట్టి మన ఖర్చులను అదుపు చేసుకోవాలి. దాని కోసం ఓ ప్లాన్‌ను రూపొందించుకోవాలి. ఇంటి అద్దె, కరెంట్‌ బిల్లు, టీవీ బిల్లు తదితరాలు తప్పనిసరిగా నెలలో ఉండే ఖర్చులను ప్లాన్‌ చేసుకుని ఇతర వాటిని తగ్గించుకుంటే.. ఈఎంఐల భారం తగ్గే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..