- Telugu News Photo Gallery Business photos CNG powered vehicles with low cost and in fuel efficiency best in the market Telugu Technology cars Photos
CNG CARS: పెట్రోల్, డీజిల్ కార్లతో విసిగిపోయారా.? అయితే ఇదిగో బెస్ట్ ఆప్షన్.. పూర్తి వివరాలు ఇక్కడే..
పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే నిర్వహణ ఖర్చు తక్కువ ఉండటంతోపాటు మంచి మైలేజీకి ఇస్తుండటంతో వాహనదారులు వాటిని కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో అధిక మైలేజీ ఇచ్చే సీఎన్‌జీ కార్ల వివరాలు మీ కోసం.
TV9 Telugu Digital Desk | Edited By: Anil kumar poka
Updated on: Dec 13, 2022 | 1:14 PM

Maruti Suzuki

Maruti Suzuki Celerio: మారుతి సుజుకీ సిలేరియో కారు ఎస్-సీఎన్‌జీ మోడల్ ప్రవేశపెట్టింది. కిలో సీఎన్‌జీతో 35.60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

Maruti Suzuki Wagon R: మారుతి సుజుకీ కంపెనీకే చెందిన మరో మోడల్ వేగన్ ఆర్. చాలా పాపులర్ వెర్షన్ ఇది. వేగన్ ఆర్ ఎస్-సీఎన్‌జీ వెర్షన్ కిలోకు 35.05 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందట.

Maruti Suzuki Alto K10: మారుతి సుజుకీకి చెందిన ఆల్టో కే-10 సీఎన్‌జీ కిట్‌తో వస్తోంది. ఇది కిలో సీఎన్‌జీకు 33.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

Maruti Suzuki X presso: మారుతి సుజుకీకే చెందిన ఎస్-ప్రెస్సో సీఎన్‌జీ వెర్షన్ కిలోకు 32.73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Maruti Suzuki Alto 800 Model S: మారుతి సుజుకీ ఆల్టో 800 మోడల్‌లో ఎస్- సీఎన్‌జీ వెర్షన్ వచ్చింది. ఇది కిలో సీఎన్‌జీకి 31. 59 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Maruti Suzuki Dzire S: మారుతి సుజుకీ డీజైర్ ఎస్- సీఎన్‌జీ మోడల్.. ఒక కేజీ సీఎన్‌జీకి 31.12 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Maruti Suzuki Shift S: మారుతి సుజుకీ స్విఫ్ట్ ఎస్-సీఎన్‌జీ వెర్షన్ కేజీ సీఎన్‌జీకి 30.90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

Maruti Suzuki Tour S: మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్ మోడల్ సీఎన్‌జీ కిట్‌తో అందుబాటులో ఉంది. ఇది ఒక కేజీ సీఎన్‌జీకి 26.55 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Maruti Suzuki Ertiga Cng: మారుతి సుజుకీ ఎర్టిగా సీఎన్‌జీ వెర్షన్ ఒక కేజీకి 26.11 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది.

Maruti Suzuki Tour M: మారుతి సుజుకీ ఎర్టిగా టూర్ ఎం మోడల్‌లో సీఎన్‌జీ వెర్షన్ వచ్చింది. ఇది కేజీ సీఎన్‌జీకి 26.08 కిలీమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది.





























