School Holidays: మాండౌస్ తుఫాను కారణంగా స్కూళ్లకు సెలవులు.. భారీ వర్షాలతో అల్లాడుతున్న దక్షిణ భారతం!
మాండౌస్ తుఫాను ప్రభావం వల్ల దక్షిణ భారత రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగనున్నాయి. భారత వాతారణ శాఖ తాజా సూచనల ప్రకారం.. డిసెంబర్ 15 వరకు భారీ వర్షాలు కురిసే..
మాండౌస్ తుఫాను ప్రభావం వల్ల దక్షిణ భారత రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగనున్నాయి. భారత వాతారణ శాఖ తాజా సూచనల ప్రకారం.. డిసెంబర్ 15 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెల్పింది. దీంతో తమిళనాడులోని పలు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు నిన్న, ఈ రోజు (బుధవారం) సెలవులు ప్రకటించారు. ఇక తమిళనాడుతోపాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా పాఠశాల మూత పడ్డాయి. రేపు విద్యాసంస్థలు తిరిగి తెరచుకుంటాయో..లేదో..అన్న విషయంపై ఇప్పటి వరకు ఇంకా స్పష్టత రాలేదు. అటు బెంగళూరులో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళ, కర్ణాటక, గోవా తీర ప్రాంతాల్లో జాలర్లు ఈ రోజు (డిసెంబర్ 14) సాయంత్రం వరకు వేటకు వెల్లవద్దని హెచ్చరించింది.
అలాగే లక్షద్వీపం, ఆగ్నేయ అరేబియా తీర ప్రాంతాల్లో డిసెంబర్ 15 సాయంత్రం వరకు, తూర్పుమధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో డిసెంబర్ 17వ తేదీ వరకు సముద్రంపై వేటకు వెల్లవద్దని జాలర్లను భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మాండౌస్ తుఫాను ప్రభావం మోస్తరు స్థాయిలో కనిపించే అవకాశం ఉంది.
మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి