Viral Video: వాహనదారులకు వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని రోడ్డు పక్కన కాలువలో చూడగా..
అదొ రద్దీ రోడ్డు. అటూ.. ఇటూ.. వెళ్తున్న వాహనదారులకు సంఖ్య ఎక్కువే. ఆ దారి మధ్యకు వచ్చేసరికి కొంతమందికి అకస్మాత్తుగా వింత శబ్దాలు..
అదొ రద్దీ రోడ్డు. అటూ.. ఇటూ.. వెళ్తున్న వాహనదారులకు సంఖ్య ఎక్కువే. ఆ దారి మధ్యకు వచ్చేసరికి కొంతమందికి అకస్మాత్తుగా వింత శబ్దాలు వినిపించాయి. ముందుగా ఆ శబ్దాలను అంతగా పట్టించుకోలేదు. మెల్లగా ఆ శబ్దాలు పెద్దగా వస్తుండటంతో డౌట్ వచ్చింది. అవి ఎటువైపు నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి రోడ్డు పక్కనే ఉన్న కాలువలో చూశారు. అంతే! ఒక్కసారిగా వారందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కోజికోడ్‌లో కొండచిలువలు కలకలం సృష్టించాయి. స్థానిక కరపరంభ శివారు ప్రాంతంలోని కనోలీ కాలువలో ఆరు కొండచిలువలు ప్రత్యక్షమయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు వాటిని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో ఆ చుట్టుప్రక్కల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ ఒక్క కొండచిలువ తప్ప.. మిగిలినవన్నీ మాయం కావడం గమనార్హం. ఆహారాన్ని వెతుకుంటూ ఆ కొండచిలువలు అడవి బయటికి వచ్చి ఉంటాయని అధికారులు చెప్పారు. ఇక దొరికిన కొండచిలువను వారు సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు.