Supreme Court Jobs: డిగ్రీ అర్హతతో భారత సుప్రీం కోర్టులో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
న్యూఢిల్లీలోని సుప్రీం కోర్టులో.. 11 కోర్టు అసిస్టెంట్ గ్రూప్ 'బి' నాన్ గెజిటెడ్ (టెక్నికల్ అసిస్టెంట్-కమ్-ప్రోగ్రామర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
న్యూఢిల్లీలోని సుప్రీం కోర్టులో.. 11 కోర్టు అసిస్టెంట్ గ్రూప్ ‘బి’ నాన్ గెజిటెడ్ (టెక్నికల్ అసిస్టెంట్-కమ్-ప్రోగ్రామర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆప్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ అప్లికేషన్‌లో మాస్టర్స్‌డిగ్రీ/కంప్యూటర్ సైన్స్‌లో ఎమ్మెస్సీ లేదా కంప్యూటర్ సైన్స్‌లో బీఎస్సీ/బీసీఏ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏడాదిపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 31, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి. రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), టెక్నికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలక రూ.80,803ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
The Registrar (Recruitment), Supreme Court of India, Tilak Marg, New Delhi-110001.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.