TS Teacher Jobs: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా టీచర్ పోస్టులు.. ఏ రాష్ట్రంలో ఎన్ని పోస్టులున్నాయంటే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో 2021-22 సంవత్సరంలో 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజ్యసభలో బుధవారం (డిసెంబర్ 14) ఆమ్ ఆద్మీ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో 2021-22 సంవత్సరంలో 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజ్యసభలో బుధవారం (డిసెంబర్ 14) ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్‌సింగ్ అడిగిన ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇస్తూ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గడచిన మూడేళ్లలో 30,001 నుంచి 30,023కి చేరుకుంది. గత మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 28,37,635 నుంచి 33,03,699 పెరిగింది. అంటే దాదాపు 16.42 శాతానికి పెరిగిందని వెల్లడించారు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్ధుల సంఖ్య 39,84,609 నుంచి 35,14,338కి తగ్గినట్లు తెలిపారు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరికలు11.80 శాతం తగ్గినట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా 50,677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇక దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో 3,753 బ్యాక్‌లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వైసీపీ ఎంపీ ఆర్ కష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ సమాధానమిచ్చారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.