Toddy from Neem Tree: వేప చెట్టునుంచి కారుతున్న కల్లు… దేవుడి మహిమే నంటూ స్థానికులు పూజలు..

తాజాగా ఓ వేప చెట్టుకు కల్లు కారడాన్ని అందరూ వింతగా చూస్తున్నారు. అంతేకాదు బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగిపోతోందంటూ అక్కడి జనం అంతా చెప్పుకుంటున్నారు. ఈ విచిత్రాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు.

Toddy from Neem Tree: వేప చెట్టునుంచి కారుతున్న కల్లు... దేవుడి మహిమే నంటూ స్థానికులు పూజలు..
Toddy From Neem Tree In Khammam
Follow us
Surya Kala

|

Updated on: Dec 06, 2022 | 6:55 AM

ప్రపంచంలో వింతలు విశేషాలకు కొదవు లేదు. మేకకు పంది పిల్ల పుట్టడం. వింత శిశువుల జననం, చింత చెట్టుకు చామంతి పువ్వు పూయడం, ఆవు పంది పిల్లలకు పాలు పట్టించడం ఇలాంటి అనేక వింత సంఘటనలు.. అనేకం ప్రపంచంలో ఎక్కడోచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలా ఎక్కడ ఏ వింతలు చోటు చేసుకున్నా వెంటనే  బ్రహ్మంగారు చెప్పింది నిజం అయింది అని అంటారు. సాక్షాత్తూ దైవ స్వ‌రూపుడైన పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి చెప్పిన కాల‌జ్ఞానంలో ఇవి ఉన్నాయని గుర్తు చేసుకుంటారు. చిన్న‌త‌నం నుండే ఎన్నో మ‌హిమ‌లు చూపిన బ్రహ్మం గారు కలియుగంలో జరగబోయే విశేషాలను, భ‌విష్య‌త్తును త‌న మ‌నోనేత్రంతో దర్శిస్తూ కాల‌జ్ఞానాన్ని ర‌చించారని అంటారు. ఇప్పటి వరకూ బ్ర‌హ్మం గారు చెప్పిన‌వి చాలా వ‌ర‌కు జ‌రిగాయి. తాజాగా ఓ వేప చెట్టుకు కల్లు కారడాన్ని అందరూ వింతగా చూస్తున్నారు. అంతేకాదు బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగిపోతోందంటూ అక్కడి జనం అంతా చెప్పుకుంటున్నారు. ఈ విచిత్రాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వింత ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే..

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ గుడి తండా గ్రామంలోని ఓ గ్రామస్తుడు రాందాస్‌. ఈయన కుటుంబ సభ్యులు ఓ వేప చెట్టుకింద నిత్యం పూజలు చేస్తుంటారు.. కొంత కాలంగా ఈ చెట్టు నుంచి తెల్లడి ద్రవం కారడం గమనించింది వీరి కుటుంబం. ముందు పెద్దగా పట్టించుకోలేదు.. జాగ్రత్తగా గమనించి చూస్తే కల్లులా అనిపించింది.. వేప చెట్టుకు కల్లు కారుతోందనే వార్త ఈనోటా, ఆనోటా అందరికీ తెలిసిపోంది.. దీంతో గుడితండాతోపాటు చుట్టుపక్కల గ్రామస్తులంతా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు.. ఇది ఏ దేవుని మహిమో తమకు అర్థం కావడం లేదంటున్నారు రామదాసు..

సాధారణంగా తాటి, ఈత చెట్లకు కల్లు వస్తుంది. ఇక్కడ వేప చెట్టు నుంచి కల్లు కారడం ఏమిటో అంతుబట్టడంలేదంటున్నారు స్థానికులు.. ఇలాంటి దృశ్యాన్ని తాము గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు.. కొందరైతే ఏకంగా కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేస్తున్నారు.. బ్రహ్మంగారు చెప్పినట్లు లోకంలో ఎంతో వింతలు జరిగిపోతున్నాయని చెప్పుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..