TSPSC Group-4: విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచే గ్రూప్ -4 అప్లికేషన్లు.. పూర్తి వివరాలివే..

నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ - 4 ఉద్యోగాల భర్తీలో కీలక సమయం ఆసన్నమైంది. నేటి (శుక్రవారం) నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థుల నుంచి ఆన్ లైన్....

TSPSC Group-4: విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచే గ్రూప్ -4 అప్లికేషన్లు.. పూర్తి వివరాలివే..
Tspsc, Group 4 Jobs
Follow us

|

Updated on: Dec 23, 2022 | 6:30 AM

నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ – 4 ఉద్యోగాల భర్తీలో కీలక సమయం ఆసన్నమైంది. నేటి (శుక్రవారం) నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ గతంలోనే వివరాలు వెల్లడించింది. మొత్తం 25 ప్రభుత్వ విభాగాల్లో 9,168 పోస్టులకు ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాల వారీగా పోస్టులతో కూడిన సమగ్ర ప్రకటనతో పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ 2023 జనవరి 12న ముగియనుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్షను ఏప్రిల్‌ లేదా మే నెలలో నిర్వహించనున్నారు.

కాగా.. గ్రూప్‌-4 ఉద్యోగాల్లో అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 1,862 వార్డు అధికారుల పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా అయితే.. 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూశాఖలో 2,077 , సీసీఎల్‌ఏ పరిధిలో 1,294, సాధారణ, సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులు ఉన్నాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859, జూనియర్‌ అకౌంటెంట్‌ 429, జూనియర్‌ ఆడిటర్‌ 18, వార్డు అధికారుల పోస్టులు 1,862 భర్తీ చేయనున్నారు.

గ్రూప్‌-4 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావడం, జనవరి 12 వరకు దరఖాస్తుల ప్రక్రియ ఉండటంతో భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తాయని కమిషన్‌ అంచనా వేస్తోంది. దాదాపు 6-7 లక్షల వరకు అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2018లో రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్‌ఓ ఉద్యోగాలకు దాదాపు 10 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. గ్రూప్‌-4 కేటగిరీలో 2 వేల లోపు పోస్టులతో ప్రకటన వెలువడినప్పుడు 4.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రస్తుతం ఏకంగా 9,168 పోస్టులు ఉండటంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి