AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్.. ఆ వార్తలు నమ్మొద్దంటూ..

డిజిటల్ విధానంలో టీచింగ్ ను స్టూడెంట్స్ కు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ట్యాబ్ లు అందిస్తోంది. అయితే ట్యాబ్ ల పై పలు వర్గాల నుంచి ప్రశ్నలు...

Andhra Pradesh: విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్.. ఆ వార్తలు నమ్మొద్దంటూ..
Andhra Pradesh
Ganesh Mudavath
|

Updated on: Dec 23, 2022 | 8:15 AM

Share

డిజిటల్ విధానంలో టీచింగ్ ను స్టూడెంట్స్ కు మరింత చేరువ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ట్యాబ్ లు అందిస్తోంది. అయితే ట్యాబ్ ల పై పలు వర్గాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ట్యాబ్ లు క్వాలిటీ గా లేవని, ఈ విధానం ద్వారా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, బయటి మార్కెట్లతో పోలిస్తే.. గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు చేసిందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో వాటన్నింటినీ చెక్ పెడుతూ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ లో రూ.11,999/- ఉన్న ట్యాబ్ ను రూ.9,800కే కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. అంతే కాకుండా ట్యాబ్ ధర నుంచి అందులో ఉండే కంటెంట్, రవాణా ఖర్చులు, ఇతర ఖర్చులు, మండల ఆఫీస్ లకు వాటిని చేర్చేంత వరకు అన్నింటినీ బేరీజు వేసుకున్నామని చెప్పింది. దీంతో రూ.221కోట్లు ఆదా చేసినట్లు వివరించింది.

సాధారణంగా అందరూ ఉపయోగించే 8 ఇంచుల ట్యాబ్ లతో పోలిస్తే ప్రభుత్వం అందిస్తున్న ట్యాబ్ లు 8.7 ఇంచెస్ ఉన్నట్లు వెల్లడించింది. ట్యాబ్ ల పంపిణీ కోసం వేసిన టెండర్ల ప్రక్రియలో నాలుగు కంపెనీలు పాల్గొనగా.. ప్రభుత్వం ఈ ప్రక్రియలో రూ.187కోట్లు ఆదా చేసిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇది సాధారణం కంటే.. 22శాతం తక్కువ అని తెలిపింది. కాబట్టి ట్యాబ్ ల పంపిణీపై వస్తున్న అవాస్తవాలను నమ్మవద్దని, ప్రభుత్వం ఏమి చేసినా ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తోందని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

కార్పొరేట్‌ విద్యను విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్ధులు, 59,176 మంది ఉపాధ్యాయులకు రూ. 778 కోట్ల బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌తో రూ. 686 కోట్ల విలువైన 5,18,740 శామ్‌సంగ్‌ ట్యాబ్‌లు ఉచితంగా అందించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..