TMC Recruitment 2022: పదో తరగతి/డిప్లొమా అర్హతతో టాటా మెమోరియల్ సెంటర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.53 వేల జీతం..

ముంబాయిలోని టాటా మెమోరియల్ సెంటర్‌కి చెందిన హోమీ భాభా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ దేశ వ్యాప్తంగా ఉన్న పలు క్యాన్సర్ ఆసుపత్రుల్లో.. 405 లోయర్ డివిజన్ క్లర్క్, అటెండెంట్, నర్స్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

TMC Recruitment 2022: పదో తరగతి/డిప్లొమా అర్హతతో టాటా మెమోరియల్ సెంటర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.53 వేల జీతం..
Tata Memorial Centre
Follow us

|

Updated on: Dec 23, 2022 | 11:13 AM

ముంబాయిలోని టాటా మెమోరియల్ సెంటర్‌కి చెందిన హోమీ భాభా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ దేశ వ్యాప్తంగా ఉన్న పలు క్యాన్సర్ ఆసుపత్రుల్లో.. 405 లోయర్ డివిజన్ క్లర్క్, అటెండెంట్, నర్స్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, ఆంకాలజీ నర్సింగ్‌లో జనరల్ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ డిప్లొమా, బీఎస్సీ లేదా తత్సమాన డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. వయసు తప్పనిసరిగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 10, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీకి చెందిన వారు అప్లికేషన్‌ ఫీజుగా రూ.300లు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/వికలాంగ/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్ ఆధారంగా తుది ఎంపకి ఉంటుంది. పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.53,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

మొత్తం 100 మర్కులకు 3 గంటల వ్యవధిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. పార్ట్ ‘ఏ’లో 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానం రాయాలి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు. పార్ట్ ‘బి’లో 50 మర్కులకు డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. స్కిల్‌ టెస్ట్ 50 మార్కులకు 45 నిముషాల్లో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఖాళీల వివరాలు..

  • లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 18
  • అటెండెంట్ పోస్టులు: 20
  • ట్రేడ్ హెల్పర్ పోస్టులు: 70
  • నర్సు-ఎ పోస్టులు: 212
  • నర్స్-బి పోస్టులు: 30
  • నర్స్-సి పోస్టులు: 55

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి
ఎండకు దూరంగా ఉంటున్నారా.? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది..
ఎండకు దూరంగా ఉంటున్నారా.? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది..
ముగిసిన నామినేషన్ల పర్వం.. బరిలో ఉన్నదీ ఎవరంటే..?
ముగిసిన నామినేషన్ల పర్వం.. బరిలో ఉన్నదీ ఎవరంటే..?
పోస్టాఫీసు-ఎల్‌ఐసీ స్కీమ్స్‌.. ఇందులో ఏ ప్లాన్స్‌ మంచివి!
పోస్టాఫీసు-ఎల్‌ఐసీ స్కీమ్స్‌.. ఇందులో ఏ ప్లాన్స్‌ మంచివి!
ప్లే ఆఫ్ చేరాలంటే గెలవాల్సిందే.. గుజరాత్, బెంగళూరు కీలకపోరు
ప్లే ఆఫ్ చేరాలంటే గెలవాల్సిందే.. గుజరాత్, బెంగళూరు కీలకపోరు
ఈ ఫొటోలో కనిపిస్తున్న కరాటే కిడ్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో కనిపిస్తున్న కరాటే కిడ్ ఎవరో గుర్తుపట్టారా..?
సైలెంట్ కిల్లర్.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా..?
సైలెంట్ కిల్లర్.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా..?