‘దేశ జనాభాలో ఇప్పటికే 98 శాతం మందికి సహజ ఇమ్యునిటీ బలపడింది.. ఫోర్త్ వేవ్ భయం లేదు’

చైనాలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బీఎఫ్‌ 7 వ్యాప్తితో మరోమారు ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. ఫోర్త్‌ వేవ్‌ భయంతో గజగజలాడిపోతున్నాయి. భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్..

'దేశ జనాభాలో ఇప్పటికే 98 శాతం మందికి సహజ ఇమ్యునిటీ బలపడింది.. ఫోర్త్ వేవ్ భయం లేదు'
Corona In India
Follow us

|

Updated on: Dec 23, 2022 | 9:34 AM

చైనాలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బీఎఫ్‌ 7 వ్యాప్తితో మరోమారు ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. ఫోర్త్‌ వేవ్‌ భయంతో గజగజలాడిపోతున్నాయి. భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధింపుపై ఊహాగానాలు సైతం ఊపందుకుంటున్నాయి. ఐతే దేశ ప్రజలపై కొత్త వేరియంట్‌ ప్రభావంపై ఐఐటీ కాన్పూర్‌ తాజాగా ఓ నివేదిక వెలువడించింది. దేశ జనాభాలో 98 శాతం మందిలో కోవిడ్‌ను ఎదుర్కొనే సహజ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందిందని, అంత భయపడవల్సిన అవసరం లేదన్నది దాని సారాంశం.

రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండేవారిపై మాత్రమే కొత్తవేరియంటఖ ప్రభావం చూపే అవకాశం ఉందని, అది కూడా చాలా స్వల్పంగానేనని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అన్నారు. అక్టోబర్ చివరి నాటికి చైనాలో కేవలం 5 శాతం జనాభాకు మాత్రమే సహజ రోగనిరోధక శక్తి రూపొందింది. నవంబర్‌లో అది 20 శాతానికి పెరిగింది. నవంబర్ నుంచి చైనాలో కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వేగంగా పెరిగింది. సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించుకున్న ప్రపంచ దేశాలకు ఎటువంటి ప్రమాదం ఉండబోదు. దక్షిణ కొరియా 25 శాతం, జపాన్‌లో 40 శాతం, అమెరికాలో 20 శాతం మంది జనాభాకు సహజ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందలేదని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.