Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు ఎదురుదెబ్బ.. ఆ రెండు పిటిషన్లను రద్దు చేసిన హైకోర్టు

బికనీర్‌ మనీ లాండరింగ్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు రాజస్తాన్‌ హైకోర్టులో గట్టి షాక్‌ ఇచ్చింది. భూముల కొనుగోలు విషయంలో రాబర్ట్ వాద్రా ప్రమేయంపై..

సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు ఎదురుదెబ్బ.. ఆ రెండు పిటిషన్లను రద్దు చేసిన హైకోర్టు
Robert Vadra
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 23, 2022 | 7:35 AM

బికనీర్‌ మనీ లాండరింగ్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు రాజస్తాన్‌ హైకోర్టులో గట్టి షాక్‌ ఇచ్చింది. భూముల కొనుగోలు విషయంలో రాబర్ట్ వాద్రా ప్రమేయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రారంభించిన మనీలాండరింగ్ విచారణను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన రెండు పిటిషన్లను రాజస్థాన్ హైకోర్టు గురువారం (డిసెంబర్‌ 22) తోసిపుచ్చింది. ఐతే ఈ కేసుకు సంబంధించి రాబర్ట్‌ వాద్రాను అరెస్ట్‌ చేయకుండా గతంలో మంజూరు చేసిన స్టేను మరో నాలుగు వారాలకు పొడిగించింది. అంటే జనవరి 19 లోగా స్టే పొందడంలో వాద్రా విఫలమైతే, ఈడీ ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది.

కాగా 2019లో స్కై లైట్‌ హాస్పిటాలిటీ అనే సంస్థ రాజస్తాన్‌లోని బికనేర్‌లో 41 ఎకరాలకు పైగా భూమిని 72 లక్షలకు 275 బిగాల ఆస్తిని కొనుగోలు చేసింది. స్కైలైట్‌కు సంబంధించిన భూములను జనవరి 4, 2010న అనేక కోట్ల రూపాయలకు విక్రయించి దాదాపు 615 శాతం లాభం గడించాడనే ఆరోపణలు రాబర్ట్‌ వాద్రా ఎదుర్కొంటున్నారు. ఈ సంస్థతో రాబర్ట్‌ వాద్రా తల్లి మౌరీన్‌ వాద్రాకు కూడా సంబంధాలు ఉన్నాయని, ఈ వ్యవహారంలో వీరు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ చెబుతోంది. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.