చైనాలో కరోనా బీభత్సం.. రోజుకు పది లక్షల కరోనా కేసులు, 5 వేల మరణాలు: రిపోర్ట్
చైనాలో ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఎఫ్-7 మారణహోమం సృష్టిస్తోంది. జీరోకోవిడ్ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత రోజుకు పది లక్షల కేసులు నమోదవుతున్నాయి. కనీసం 5 వేల మంది మృతి చెందుతున్నట్లు..
చైనాలో ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఎఫ్-7 మారణహోమం సృష్టిస్తోంది. జీరోకోవిడ్ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత రోజుకు పది లక్షల కేసులు నమోదవుతున్నాయి. కనీసం 5 వేల మంది మృతి చెందుతున్నట్లు లండన్‌కు చెందిన ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ అంచనా వేస్తూ నివేదిక విడుదల చేసింది. వచ్చే నెల (జనవరి)లో రోజువారీ కేసుల సంఖ్య 37 లక్షలకు చేరుకుంటాయని పేర్కొంది. ఇక మార్చి నెల నాటికి రోజూ 42 లక్షల కేసులు నమోదవుతాయని ఈ సంస్థ తన నివేదికలో హెచ్చరించింది. మరోవైపు చైనా మాత్రం అట్లాంటిది ఏమీ లేదు.. ఇక్కడ ఒక్క కరోనా మృతి కూడా సంభవించడం లేదని చెబుతోంది. ఇదంతా పక్కన పెడితే చైనా నగరాల్లోని సమాదుల వద్ద ఎందుకు రద్దీ నెలకొందో ఆ దేశ ప్రభుత్వం వివరణ ఇవ్వడం లేదు. చైనాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిక్కిరిసిసోయాయని, మృతదేహాలతో ఆసుపత్రి గదులు నిండిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా బారీనా అధిక శాతం వృద్ధులు పడుతున్నట్లు, వైద్యులు సైతం కరోనా సోకినా తమ విధులు నిర్వర్తిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థల కథనాలు వెల్లడిస్తున్నాయి. కరోనా చికిత్సకు సరిపడా మందులు కూడా అందుబాటులోలేక చైనా ప్రజలు ఇక్కట్లపాలవుతున్నట్లు తెల్పుతున్నాయి
వాస్తవ పరిస్థితిని దాచిపెట్టి.. కరోనా కేసుల్ని బాగా తక్కువ చేసి చూపిస్తోందని ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ పేర్కొంది. చైనా ప్రభుత్వం గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 3 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయని, కరోనాతో ఒక్కరు కూడా మృతి చెందలేదని చెబుతోంది. చైనాలో కరోనా పరిస్థితిపై జిన్‌పింగ్ ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించకపోవడంపై డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చైనా కచ్చితమైన డేటా వెల్లడించి కరోనా కట్టడికి పరిష్కార మార్గాలు చూడాలని కోరారు.
మరిన్ని అంతర్జాతీయ సమాచారం కోసం క్లిక్ చేయండి.