UPSC CDS 2023 Notification: దేశ త్రివిధ దళాల్లో చేరాలనుకుంటున్నారా? యూపీఎస్సీ- సీడీఎస్ 2023కు ఇలా దరఖాస్తు చేసుకోండి.. అర్హతలేవంటే..
ఆర్మీ, నేవీ, ఏయిర్ ఫోర్సుల్లో ఉద్యోగ నియామకాలకు యూపీఎస్‌సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ) 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అవివాహితులైన యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు..
ఆర్మీ, నేవీ, ఏయిర్ ఫోర్సుల్లో ఉద్యోగ నియామకాలకు యూపీఎస్‌సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ) 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అవివాహితులైన యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది. ఎంపికైన వారు త్రివిదదళాల్లో ఆకర్షణీయ జీతంతో కెరీర్‌లో దూసుకెళ్లే సదవకాశం.. మొత్తం 341 పోస్టులకు ఈ నోటిఫికేషన్ ద్వారా నియామక ప్రక్రియ చేబట్టబోతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే..
ఈ అర్హతలు అవసరం..
మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకైతే ఏదైనా విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొందితే సరిపోతుంది. నావెల్ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ డిగ్రీ అవసరం. ఇక ఏయిర్‌ఫోర్స్ పోస్టులకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్, డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఓటీఏ ఎస్‌ఎస్‌సీ నాన్ టెక్నికల్ పోస్టులకు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న వారు కూడా ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు ఎంత ఉండాలంటే..
- ఇండియన్ మిలటరీ అకాడెమీ, నేవల్ అకాడెమీ పోస్టులకు జనవరి 2, 2000 నుంచి జనవరి 1, 2005 మధ్య జన్మించి ఉండాలి.
- ఏయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు జనవరి 2, 2000 నుంచి జనవరి 1, 2004 మధ్య జన్మించిన వారు అర్హులు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ఠ వయసులో రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు జనవరి 2, 1999 నుంచి జనవరి 1, 2005 మధ్య జన్మించి ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 10, 2023వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఏప్రిల్ 16, 2023న నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారు ఆయా అకాడమీల్లో ట్రైనింగ్‌కు ఎంపికవుతారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
విభాగాల వారీగా ఖాళీలు ఇవే..
- ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), దెహ్రాదూన్- 100
- ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమల- 22
- ఎయిర్ ఫోర్స్ అకాడమీ(ఏఎఫ్‌ఏ), హైదరాబాద్- 32
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ మెన్ నాన్ టెక్నికల్- 170
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ ఉమెన్ నాన్ టెక్నికల్- 17.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.