AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Crime: నీళ్లు ఎందుకు చిందించావని ప్రశ్నించినందుకు బైకును ఢీకొన్న కారు.. మహిళ మృతి!

రోడ్డుపై గుంటల్లో ఉన్న నీళ్లపై నుంచి వేగంగా వెళ్తున్న కారు పక్కనే ఉన్న బైక్‌పై నీళ్లు చిమ్మింది. ఎందుకు చేశావంటూ ప్రశ్నించడంతో.. కోపోధ్రిక్తుడైన కారు డ్రైవర్‌ 2 బైక్‌లను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో..

Hyderabad Crime: నీళ్లు ఎందుకు చిందించావని ప్రశ్నించినందుకు బైకును ఢీకొన్న కారు.. మహిళ మృతి!
Car Driver Hits Bike
Srilakshmi C
|

Updated on: Dec 22, 2022 | 9:36 AM

Share

రోడ్డుపై గుంటల్లో ఉన్న నీళ్లపై నుంచి వేగంగా వెళ్తున్న కారు పక్కనే ఉన్న బైక్‌పై నీళ్లు చిమ్మింది. ఎందుకు చేశావంటూ ప్రశ్నించడంతో.. కోపోధ్రిక్తుడైన కారు డ్రైవర్‌ 2 బైక్‌లను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. గచ్చిబౌలి ఏఐజీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం..

ఎర్రగడ్డకు చెందిన సయ్యద్‌ సైఫుద్దీన్‌ (27), అతని భార్య మారియా మీర్‌ (25)తో కలిసి బైక్‌పై డిసెంబర్‌ 18న అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో మాదాపూర్ మీదుగా గచ్చిబౌలి బయల్దేరారు. వీరితోపాటు సయ్యద్‌ మిరాజుద్దీన్‌, రాషెద్‌ మాషా ఉద్దీన్‌ అనే వ్యక్తులు కూడా మరో బైక్‌పై మాదాపూర్‌ వంతెన మీదుగా గచ్చిబౌలికి వెళ్తున్నారు. ఏఐజీ సమీపంలోకి రాగానే, బెంజ్‌ కారులో వెళ్తున్న జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి రాజసింహారెడ్డి (26) అక్కడి రోడ్డుపై ఉన్న నీటిలో నుంచి దూసుకెళ్లడంతో మిరాజుద్దీన్‌, రాషెద్‌ మాషా ఉద్దీన్‌లు ప్రయాణిస్తున్న బైక్‌పై నీళ్లు పడ్డాయి. దీంతో వారు కారు డ్రైవర్‌ను వెంబడించి.. అలా ఎందుకు చేశావని నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన రాజసింహారెడ్డి కారుతో ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడిపోయారు. దీన్ని గమనించిన సైఫుద్దీన్‌, మారియా మీర్ దంపతులు కారు డ్రైవర్‌ను వెంబడించి ప్రశ్నించారు. దీంతో రాజసింహారెడ్డి వారిని కూడా ఢీకొట్టాడు.

ఈ ఘటనలో మారియా వాహనంపై నుంచి ఎగిరి కొద్దిదూరంలో పడి తీవ్ర గాయాలపాలైంది. మారియాను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం (డిసెంబర్‌ 21) తెల్లవారుజామున మృతి చెందింది. మారియాకు 8 నెలల పాప ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్‌ చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం