‘మన దేశానికి ఇద్దరు పితామహులు..! నాటి భారతానికి మహాత్మాగాంధీ అయితే.. నవభారతానికి నరేంద్రమోదీ..’

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ భార్య అమృతా ఫడ్నవిస్‌ మన దేశానికి ఇద్దరు పితామహులు ఉన్నారంటూ మంగళవారం (డిసెంబర్‌ 20) కీలక వ్యాఖ్యలు చేశారు..

'మన దేశానికి ఇద్దరు పితామహులు..! నాటి భారతానికి మహాత్మాగాంధీ అయితే.. నవభారతానికి నరేంద్రమోదీ..'
Amruta Fadnavis
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 22, 2022 | 6:59 AM

Narendra Modi is ‘father of New India’: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ భార్య అమృతా ఫడ్నవిస్‌ మన దేశానికి ఇద్దరు పితామహులు ఉన్నారంటూ మంగళవారం (డిసెంబర్‌ 20) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కాలానికి జాతిపిత మహాత్మాగాంధీ అయితే, నవ భారతానికి జాతిపిత ప్రధాని నరేంద్ర మోదీ అంటూ అభివర్ణించారు. నాగ్‌పూర్‌ రచయితల సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు అమృతా ఫడ్నవిస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె నరేంద్ర మోదీని రాష్ట్ర పితగా వ్యవహరించారు. మృతా ఫడ్నవిస్‌ తాజా వ్యాఖ్యలు సంచలంగా మారాయి. దీంతో బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్నాయి. స్వాతంత్ర సమరయోధులను, జాతీయ చిహ్నాలను అవమానకరంగా మాట్లాడినందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు యశోమతి ఠాకూర్ అమృతపై విరుచుకుపడ్డారు.

‘ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ సిద్ధాంతాలను అనుసరిస్తున్న వ్యక్తులు గాంధీజీని మళ్లీ మళ్లీ చంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అబద్ధాలను పునరావృతం చేయడం, మహాత్మా గాంధీ వంటి గొప్ప వ్యక్తులను కించపరచడం ద్వారా చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ’ ఠాకూర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇలా అమృతా ఫడ్నవిస్‌ మోదీని పొగడ్తలతో ముంచెత్తడం ఇది మొదటి సారేంకాదు. 2019లో ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా పంపిన ట్వీట్‌లో ‘మన దేశ పితామహుడు నరేంద్ర మోదీజీకి జన్మదిన శుభాకాంక్షలు’ అని పోస్టు పెట్టారు. ఈ మధ్యకాలంలో తరుచూ సోషల్‌ మీడియాలో ఈ విధమైన పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ కాలానికి ఛత్రపతి శివాజీ, నేటి కాలానికి డా. బీఆర్‌ అంబేద్కర్‌, కేంద్ర మంత్రి నితిన్‌ గట్కరీ ఆధునిక కాలానికి ఐకాన్‌లంటూ గతంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.