TS Staff Nurse Notification: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఈ నెలఖరులోగా 4,661 నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..

తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (MHSRB) త్వరలో 4,661 స్టాఫ్‌ నర్సు పోస్టులకు నియామక ప్రకటన వెలువరించనుంది. ఈ నెలాఖరులోగా అంటే డిసెంబ‌రు 31లోగా నోటిఫికేషన్‌ కూడా..

TS Staff Nurse Notification: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఈ నెలఖరులోగా 4,661 నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..
TS Staff Nurse Notification
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 21, 2022 | 1:39 PM

తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (MHSRB) త్వరలో 4,661 స్టాఫ్‌ నర్సు పోస్టులకు నియామక ప్రకటన వెలువరించనుంది. ఈ నెలాఖరులోగా అంటే డిసెంబ‌రు 31లోగా నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసేందుకు పన్నాహాలు చేస్తున్నారు. నర్సు పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి మెరిట్‌ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. ప్రకటన అనంతరం పరీక్షకు సన్నద్ధమవడానికి వీలుగా కనీసం రెండు నెలల గడువు ఉండేలా హెడ్యూల్‌ రూపొందిస్తారట. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు ప్రశ్నపత్రం రూపకల్పనకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు. రాత పరీక్షలో సాధించిన మార్కులకు, వెయిటేజీ మార్కులను కూడా కలుపుతారు. అనంతరం తుది మెరిట్‌లిస్టును ప్రకటిస్తారు. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి ఎలాంటి నిబంధనలు అనుసరిస్తున్నారో.. స్టాఫ్‌నర్సుల నియామకాలకు కూడా అదే విధానాన్ని అనుసరించాలని వైద్యశాఖ బోర్డుకు సూచించింది.

వెయిటేజీ ఇలా..

ఇప్పటికే ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన స్టాఫ్‌నర్సులుగా పనిచేస్తున్నవారికి, గతంలో పనిచేసినా వారికి వెయిటేజీ మార్కులుంటాయి. స్టాఫ్‌నర్సు అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్ఠంగా 80 పాయింట్లు ఇస్తారు. మిగిలిన 20 పాయింట్లను పని అనుభవానికి వెయిటేజీగా కేటాయిస్తారు. ఈ విధంగా మొత్తం వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. వెయిటేజీ ప్రాంతాన్ని బట్టి కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన, చేస్తున్నవారికి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, ఇతర ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇస్తారు. ఇక్కడ 6 నెలలు పూర్తయితేనే వెయిటేజీకి అర్హులన్నమాట. ఆయా వైద్య సంస్థల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నవారు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్‌ పొందవల్సి ఉంటుంది. అలాగే నర్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులందరూ తెలంగాణ స్టేట్ నర్సింగ్‌ కౌన్సిల్‌లో తమ అర్హత ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.