Winter Solstice 2022: గుర్తుందా..! ఈ రోజే అత్యంత షార్టెస్ట్ డే.. పగలు తక్కువ, రాత్రి ఎక్కువ.. దీనివెనుక సైన్స్ రహస్యం ఇదే

సాధారణంగా శీతాకాలంలో త్వరగా చీకటి పడిపోవడం, ఆలస్యంగా తెల్లారడం వంటి మార్పులు సహజం. ఐతే కొన్నిసార్లు మరీ త్వరత్వరగా చీకటి పడిపోతుందనే అనుమానం కూడా కలుగుతుంటుంది. అచ్చం అలాంటి రోజే ఈ రోజు..

Winter Solstice 2022: గుర్తుందా..! ఈ రోజే అత్యంత షార్టెస్ట్ డే.. పగలు తక్కువ, రాత్రి ఎక్కువ.. దీనివెనుక సైన్స్ రహస్యం ఇదే
Winter Solstice
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 22, 2022 | 8:06 AM

సాధారణంగా శీతాకాలంలో త్వరగా చీకటి పడిపోవడం, ఆలస్యంగా తెల్లారడం వంటి మార్పులు సహజం. ఐతే కొన్నిసార్లు మరీ త్వరత్వరగా చీకటి పడిపోతుందనే అనుమానం కూడా కలుగుతుంటుంది. అచ్చం అలాంటి రోజే ఈ రోజు (షార్టెస్ట్‌ డే). అంటే ఈ రోజు (డిసెంబర్‌ 22) పగలు నిడివి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అలాగే సాయంత్రం త్వరగా చీకటి పడిపోతుంది. అంతేకాదు నేటి రాత్రి సుదీర్ఘమైనది.. దాదాపు 14 గంటలపాటు రాత్రి కొనసాగుతుంది. పగలు తగ్గువగా ఉండి, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా పగటి సమయం 12 గంటలుగా ఉంటుంది. ఐతే షార్టెస్ట్‌ డే రోజున మాత్రం పగలు 10 గంటల 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఎందుకిలా అనే అనుమానం వస్తోందా..? ఐతే మనం ఖగోళ శస్త్రంలోకి తొంగి చూడవల్సిందే.

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ.. సూర్యుని చుట్టూ తిరుగుతుంటుందని చిన్నప్పుడు చదువుకుని ఉంటారు. ఇలా తిరుగుతూ కాలానుగుణ మార్పులకు దారితీస్తుంది. ప్రతి ఏటా డిసెంబర్ 21 లేదా 22 తేదీల్లో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తర అర్ధగోళంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా (శీతాకాలం) ఉంటుంది. అలాగే భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న భాగం వైపు వేసవి కాలం ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో దీనిని అతిపెద్ద రోజుగా పిలుస్తారు. అంటే దీని తర్వాత భూమి ఉత్తరార్ధగోళం వైపు కదులుతాడు. దీని కారణంగా భూమి ఉత్తర భాగంలోని దేశాలలో పగలు పొడవు క్రమంగా పెరగడంతో రాత్రి సమయం తగ్గడం మొదలవుతుంది. ప్రతి ఏడాది ఈ విధంగా డిసెంబర్‌ 21 లేదా డిసెంబర్‌ 22 తేదీల్లో జరుగుతుంది. గత ఏడాది (2020) డిసెంబర్‌ 21న సుదీర్ఘ రాత్రి వచ్చింది. ఇక ఏడాది డిసెంబర్‌ 22న అంటే ఈ రోజు వస్తోంది.

Winter Solstice

Winter Solstice

నాసా ప్రకారం.. అయనాంతం రోజున ఉత్తరార్ధగోళంలో సాయంత్రం 4 గంటల 48 నిముషాలకు శీతాకాలం ప్రవేశిస్తుంది. దక్షిణ అర్ధగోళం ఆ రోజున వేసవి కాలంలోకి ప్రవేశిస్తుంది. అయనాంతం సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. ఉత్తర అర్ధగోళంలో వేసవి కాలం జూన్‌లో వస్తుంది. దక్షిణార్ధగోళంలో డిసెంబర్‌లో వస్తుంది. ఏడాది పొడవునా ఆకాశంలో సూర్యుడి స్థానం మారడం అనేది భూమి ఒక అక్షం వంపు కారణంగా వస్తుందని అని నాసా తెలిపింది. ఏడాది కాలంలో సూర్యుని స్థానభ్రంశం, దాని కదలికలను అంచనా వేయడానికి ఇంగ్లాండ్‌లోని స్టోన్‌హెంజ్, పెరూలోని మచు పిచ్చులోని టోరియన్ వంటి స్మారక కట్టడాలను నాటి పూర్వికులు నిర్మించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.