IIM CAT Result 2022 Out: క్యాట్-2022 ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలంగాణ విద్యార్ధులు..
దేశ వ్యాప్తంగా నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్టు (క్యాట్-2022) ఫలితాలు బుధవారం (డిసెంబర్ 21) విడుదలయ్యాయి. ఈ ఏడాది నవంబర్ 27న నిర్వహించిన క్యాట్ పరీక్ష 2 లక్షల 22 వేల మంది హాజరయ్యారు. దీనికి సంబంధించిన..
దేశ వ్యాప్తంగా నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్టు (క్యాట్-2022) ఫలితాలు బుధవారం (డిసెంబర్ 21) విడుదలయ్యాయి. ఈ ఏడాది నవంబర్ 27న నిర్వహించిన క్యాట్ పరీక్ష 2 లక్షల 22 వేల మంది హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫలితాలను ఐఐఎం బెంగళూరు ప్రకటించింది. పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాల్లో 11 మంది నూటికి 100 మార్కులు సాధించారు. 22 మంది 99.99 శాతం స్కోర్ సాధించారు. 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన వారు ఇద్దరున్నారు. 100 పర్సంటైల్ సాధించిన వారిలో ఢిల్లీ, మహారాష్ట్రలకు చెందిన వారు ఇద్దరేసి చొప్పున ఉన్నారు. గుజరాత్, హరియాణా, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే నాన్ ఇంజినీరింగ్ అభ్యర్థి ఉన్నారు. ఐతే టాపర్ల పేర్లను ఐఐఎం బెంగళూరు ఇంకా వెల్లడించలేదు. కాగా దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఐఐఎంలు, ఇతర మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి ప్రతీ యేట క్యాట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
CAT 2022 Result ఇలా చెక్ చేసుకోండి..
ముందుగా క్యాట్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చెయ్యాలి. టాప్‌లో కుడివైపున ఉన్న లాగిన్ లింక్‌పై క్లిక్ చేయాలి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత ‘క్యాట్ 2022 రిజల్ట్/స్కోర్‌కార్డు’ లింక్‌పై క్లిక్ చేయాలి. వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. సేవ్ చేసుకుని, హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.