Telangana: నర్సరీ స్టూడెంట్‌ను చితకబాదిన టీచర్.. ప్రిన్సిపల్ నిర్లక్ష్యపు సమాధానం..
తల్లీదండ్రుల తరువాతీ స్ధానం గురువులదే అలాంటి గురువులే విద్యార్ధుల పాలిట యమ భటులుగా మారుతున్నారు.. నర్సరీ విద్యార్ధి ధనుష్‌ను చితకబాదిన టీచర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
తల్లీదండ్రుల తరువాతీ స్ధానం గురువులదే అలాంటి గురువులే విద్యార్ధుల పాలిట యమ భటులుగా మారుతున్నారు.. నర్సరీ విద్యార్ధి ధనుష్‌ను చితకబాదిన టీచర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
విద్యార్ధులు ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గర కంటే పాఠశాలలో ఉపాధ్యాయుల వద్దే ఎక్కవ సమయం గుడుపుతుంటారు. ఆలాంటప్పుడు పిల్లలను ప్రేమగా చూసుకోవలసిన టీచర్లు, పాఠశాల యాజమాన్యం పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పాఠశాలలో చిన్నచిన్న తప్పులు చేసినా పెద్దశిక్షలు వేస్తూ పిల్లల పట్ల యమభటుల్లగా తయారయ్యారు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాల్సిన టీచర్‌లే క్రమశిక్షణ తప్పుతూ, పిల్లలని చూడకుండ కోపంతో నర్సరీ విద్యార్థి ధనుష్ ను వాతలు వచ్చేలా ఊగిపోతూ చితకబాదాడు. చైతన్య పురిలోని గణేష్ పురి కాలనీ ప్రిన్స్ హై స్కూల్‌లో నర్సరీ విద్యార్థిని క్లాస్ టీచర్ కర్కశంగా వాతలు వచ్చేలా చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పై స్కూల్ యాజమాన్యాన్ని పేరెంట్స్ సంప్రదించగా రాయడం లేదని కొట్టి ఉండొచ్చు అంటూ ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాలుడి మేనమామ కిషోర్ ఎంఈఓ కు, చైతన్యపురి పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.