Telangana Congress: దిగ్విజయ్ సింగ్‌తో భేటీకి సిద్ధమైన రెండు వర్గాలు.. మరి డిగ్గీ రాజా మంతనాలు ఫలించేనా?
మ్యాటర్ సీరియస్ అయింది. డీల్ చేసేందుకు డిగ్గీరాజా హైదరాబాద్ వచ్చేశారు. డ్యామేజ్ కంట్రోలే అసలు టార్గెట్. పోటాపోటీగా ఫిర్యాదు చేసుకునేందుకు రెండు వర్గాలు రెడీ అయ్యాయి. మరి దిగ్విజయ్ మంతనాలు ఫలిస్తాయా?
మ్యాటర్ సీరియస్ అయింది. డీల్ చేసేందుకు డిగ్గీరాజా హైదరాబాద్ వచ్చేశారు. డ్యామేజ్ కంట్రోలే అసలు టార్గెట్. పోటాపోటీగా ఫిర్యాదు చేసుకునేందుకు రెండు వర్గాలు రెడీ అయ్యాయి. మరి దిగ్విజయ్ మంతనాలు ఫలిస్తాయా? రెండుగా విడిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌ను ఒక్కటి చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు దిగ్విజయ్ సింగ్. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లో ల్యాండయ్యారు. అసలేం జరిగింది..? అసంతృప్తి కాస్తా.. అసమ్మతిగా ఎందుకు మారింది? సీనియర్ల గుస్సాకు కారణాలేంటన్న దానిపై హైకమాండ్‌కు సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు దిగ్విజయ్.
హైదరాబాద్ రావడానికి ముందే ఢిల్లీలోనే యాక్షన్ షురూ చేశారు దిగ్విజయ్ సింగ్. తెలంగాణ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్, సహ ఇంచార్జ్‌లు బోసురాజు, నదీమ్ జావేద్, రోహిత్ చౌదరిలో కీలక సమావేశం నిర్వహించారు. ఏం జరిగిందన్నదానిపై ఓ రిపోర్టు కూడా ఇచ్చినట్లు సమాచారం. కేవలం కమిటీల్లో సీనియర్లకు ప్రాధాన్యం దక్కకపోవడమే కారణమా? అంతకుమించి ఏమైనా ఉన్నాయా అన్న అంశాలపై వాకబు చేశారు దిగ్విజయ్.
ఉదయం ఢిల్లీలో దిగ్విజయ్‌సింగ్‌ను రేవంత్‌రెడ్డి కలవడం ఆసక్తికరంగా మారింది. రేవంత్ ఏం మాట్లాడారు? ఇటీవలి వివాదాలపై ఏదైనా నివేదిక ఇచ్చారా? తమ వర్షన్‌ను ముందే చెప్పేశారా అన్న చర్చ జరుగుతోంది. డిగ్గీరాజా వస్తున్నది సీనియర్లను బుజ్జగించేందుకు. వాళ్లంతా ఇప్పటికే రేవంత్ తీరుపై గరంగరంగా ఉన్నారు. దిగ్విజయ్ తమ వర్షన్ వింటారు. న్యాయం చేస్తారన్న హోప్‌తో ఉన్నారు. అటు రేవంత్ వర్గం కూడా ఢీ అంటే ఢీ అంటోంది. ఇప్పటికే 12 మంది పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. అసమ్మతులతో కూడిన G-9 గ్రూప్, రేవంత్ గ్రూప్ ఇద్దరూ రిపోర్టులతో రెడీ అయినట్లు తెలుస్తోంది. దిగ్విజయ్ దగ్గరే తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు.
మొత్తానికి పార్టీకి మరింత బూస్టప్ ఇద్దామన్న ఉద్దేశంతో హైకమాండ్ నియమించిన పీసీసీ కమిటీలు కాంగ్రెస్‌లో పెద్ద కల్లోలమే రేపాయి. సీనియర్లు వర్సెస్ రేవంత్‌రెడ్డి అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఒరిజనల్ కాంగ్రెస్ వర్సెస్ వలస వాదులు, సేవ్ కాంగ్రెస్ అంటూ మ్యాటర్ ఇప్పటికే చాలా దూరం వెళ్లింది. పంచాయితీ కేవలం ఇటీవలి కమిటీలకు మాత్రమే పరిమితం కాదన్నది క్లియర్. పాతవిషయాలను తవ్వుకుంటున్నాయి రెండు వర్గాలు. మరి డిగ్గీరాజా ఈ పంచాయితీని డీల్ చేయగలరా అన్నది ఇప్పుడు ఓ పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయన రాకపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. పైగా ఆయన ముందే రేవంత్‌రెడ్డిని కలవడం కూడా పలువురు సీనియర్లకు నచ్చడం లేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..